×

Grand vana bhojanam with prahladavarada

Grand vana bhojanam with prahladavarada

*Kidambi Sethu raman*

Sri Ahobila math paramparadheena
Srimadaadivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam,
Ahobilam.

Kartheeka vanabhojanothsavam

26.11.2018

Sri Prahladavarada vijayam to vanabhojana mantapam.
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీమదాదివన్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం
అహోబిలం.

కార్తీక వనభోజనోత్సవం

వరిచేల మధ్యనున్న వనభోజన మంటపానికి మేని హొయలు చూపుకుంటా విజయం చేసిన శ్రీ ప్రహ్లాదవరదులు

చిన్ని కృష్ణుడి వోలె గోప బాలురను వెంట పెట్టుకొని అహోబిల దేవుడు వనభోజన మంటపం చేరినాడు.
నరసింహుడు యాదవ సింహమైనాడు….
భవనాశిని యమునగా మారి ప్రవహిస్తున్నది…..
అహోబిలం బృందావనమైనది…..
దాస జనులెల్ల గోప బాలకులైయ్యిరి….
శ్రీ భూ సతులు గోప కాంతలైనారు…..

ఆ గరుడాద్రి కృష్ణుడు ప్రహ్లాదవరదుని తోడ వన భోజనము సేయ మీ అందరిని రమ్మని ఒక గోప బాలుడనై వేగమే రమ్మని పిలుస్తున్నాను……..
బేగ రారో మీరెల్లను శ్రీ వనము చేరరో
నగుమోము చక్కని నల్లనివానితోడ

కూతలు కూయుచు కొమ్మబూరలూదుతూ
అతి ఘోషముల తోడ డప్పులు వాయిస్తూ
చేత చల్ది మూటలట్టుకొని పాటలు పాడుతూ
కతకారితనముల గరుడాద్రి కృష్ణునితోడ

నెమలి పించము నెత్తిన నాట్యమాడగా
భామలిద్దరు ఇరుగడల కైదండలిడగా
కమల పత్రముల నడుమ కర్ణిక వోలె
అమరి ఆటలాడు అమరవంద్యుని తోడ

వరిచేల మధ్యనున్న వనభోజన మంటపాన
సిరి భూ సతులతోడ తిరుమజ్జనమాడి
తిరుమేని వగలు చూపి తీగెనవ్వులు జల్లే
నిరతి దాసుల గాచే ప్రహ్లాదవరదునితోడ
Meaning…..

All of you come to lakshmi vanam. very fast..You all come along with this black coloured beautiful guy.

Sound high make the noise of joy.
Play the bamboo instrument.
Play drums in joy.
Bring the bag of curd rice.sing the songs.with great joy come with this naughty garudaadri krishna…

You all come with the Lord of devas on whose head peacocks feather is dancing….
On his both sides two ladies are present.
He is sitting like a karnika in lotus flower and playing games.

You all come with prahladavarada who always come for the rescue of his dasas.he reached vanabhojana mantapam which is in paddy fields.he is going to enjoy the celestial bath along with sri devi and bhoodevi
He is showing his thirumeni soundaryam and laughing naughtily.

Come on let us have grand vana bhojanam with prahladavarada
Ahhobila deva reached vanabhojana mantapam as sri krishna.
Bhavanashini became Yamuna.
Sri devi and bhoodevi became gopikas…..
All the dasas became gopas.

I am ,one among the gopas inviting you all to immediately to vana bhojana mantapam…..

శ్రీ అహోబిల మఠం 46వ పీఠాధిపతి వారి ఆశీస్సులతో….

కృతి సమర్పణం

26.11.2018 సోమవారం శ్రీ అహోబలేశ్వరుల కార్తీక వనభోజనోత్సవం సందర్భంగా శ్రీ అహోబిల ప్రహ్లాదవరదుల దివ్య శ్రీ చరణారవిందములకు ఆ దేవదేవుని శ్రీ పాద రేణువు శ్రీ నరసింహ ప్రసాద్ గారిచే రచింపబడిన
ఎనిమిది పాటల పద పుష్పం….. అచ్యుతునకు అష్టపది సమర్పించబడుతున్నది….
Kruthi samarpanam

With the divine blessings of his holiness 46th peetaadhipathi of sri ahobila math ….

,on the eve of karthika vanabhojanothsavam of sri Ahobaleshwara a pada pushpam…. ACHYUTHUNAKU ASTHAPADI….a audio CD With 8 songs is released at the lotus feets of sri Prahladavarada

శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో వనభోజనోత్సవము పూర్తి .ఉభయ దేవేరులు ఎదురుగా వేంచేయగా పుష్ప పల్లకిలో వనభోజన మంటపం నుండి ఆలయానికి వేంచేశారు.
 Vanbhojanaothsavam concluded.sri Prahladavarada returned back to Sannidhi in Pushpa pallaki in a grand manner…

print

Post Comment

You May Have Missed