వెలిగాయి లక్ష దీపాలు -పులకించిన భక్తుల్లో ఆనంద కాంతులు

 శ్రీశైలదేవస్థానం:కార్తిక మూడవ సోమవారం సందర్భంగా ఈ రోజు (22.11.2021) పుష్కరిణి వద్ద దేవస్థానం లక్షదీపోత్సం మరియు పుష్కరిణిహారతిని ఘనంగా నిర్వహించింది. లోకకల్యాణం కోసం ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

కార్తికమాసంలో ప్రతి సోమవారం,  కార్తిక పౌర్ణమి రోజులలో ఈ లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ లక్షదీపోత్సవం, పుష్కరిణిహారతి కార్యక్రమాలు చేస్తున్నారు.

| లక్షదీపోత్సవం

ఈ దీపోత్సవ కార్యక్రమంలో పుష్కరిణి ప్రాంగణమంతా కూడా దీపాలను ఏర్పాటు చేసారు.

కార్తీకమాసంలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యముంది. ఈ మాసంలో దీపారాధననే కాకుండా దీపదర్శనం కూడా ఎంతో పుణ్యదాయకమని పురాణాలు చెబుతున్నాయి. 

కార్తీక దీపదర్శన వలన జాతిభేదం లేకుండా మానవులందరికీ, ఇంకా పక్షులు, కీటకాలు, జలచరాలు మొదలైన వాటికి, ఇంకా వృక్షాలకు కూడా పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి.

పుష్కరిణి హారతి (దశవిధ హారతులు)

ఈ రోజు (22.11.2021) సాయంత్రం గం. 6.30ల నుండి ముందుగా శ్రీస్వామి అమ్మవార్లకు మరియు పుష్కరిణికి దశవిధ హారతులు ఇవ్వడం ప్రత్యేకం.

కాగా ఈ కార్యక్రమానికి ముందుగా శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్కరిణి వద్దకు వేంచేబు చేయించి విశేషంగా పూజాదికాలు జరపడం ప్రత్యేకం.. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లకు, పుష్కరిణికి దశవిధ హారతులను సమర్పించారు.

దశహారతులు-దర్శనఫలం

  1. ఓంకారహారతి:

పరబ్రహ్మ స్వరూపమైన బీజాక్షరమే ఓంకారం. ఈ ఓంకారహారతిని దర్శించడం వలన కష్టాలన్నీ నివారించబడతాయి. సకల శుభాలు కలుగుతాయి.

  1. నాగహారతి:

ఈ నాగహారతిని దర్శించడం వలన సర్పదోషాలు తొలగిపోతాయి. సంతానం కలుగుతుంది. 3. త్రిశూలహారతి:

ఈ త్రిశూలహారతిని దర్శించడం వలన అపమృత్యువు అంటే అకాలమరణం తొలగిపోతుంది. గ్రహదోషాలు నివారించబడతాయి. 4. నందిహారతి:ఈ నందిహారతిని దర్శించడం వలన భయం, దుఃఖము ఉండవు. ఆనందం, ఉత్సాహం లభిస్తాయి. 5. సింహహారతి: ఈ సింహహారతిని దర్శించడం వలన శత్రుబాధలు తొలగుతాయి. మనో ధైర్యం కలుగుతుంది. 6. సూర్య హారతి : ఈ సూర్య హారతిని దర్శించడం వలన ఆరోగ్యం చేకూరుతుంది. దీర్ఘాయుషు లభిస్తుంది. 7. చంద్రహారతి :ఈ చంద్రహారతి దర్శించడం వలన మనశ్శుద్ధి కలిగి, ఈర్ష్య, అసూయ ద్వేషాలు తొలగిపోతాయి.మానసిక ప్రశాంతత లభిస్తుంది. 8. కుంభహారతి:ఈ కుంభహారతిని దర్శించడం వలన కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. సంపదలు కలుగుతాయి. 9. నక్షత్రహారతి:ఈ నక్షత్ర హారతిని దర్శించడం వలన జాతక దోషాలు తొలగిపోతాయి. చేపట్టిన పనులలో విజయం లభిస్తుంది. కర్పూరహారతి : 10. ఈ కర్పూరహారతిని దర్శించడం వలన పాపాలన్నీ తొలగిపోతాయి. యజ్ఞఫలంతో పాటు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.

*Donation of Rs.1,11,111/- For Annadanam By  Veera Setteswara Swamy, Sanga Reddy District, Telangana.

* Donation of Rs.One Lakh For Annadanam By M.V.Subbarao, Machilipatnam

* Donation of Rs.One Lakh For Annadanam By  M.V.Subbarao, Machilipatnam

*Donation of Rs.1,00,116/- For Annadanam By  T.Nagendra Rao, cheyyeru, East Godavari District, AP.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.