

శ్రీశైల దేవస్థానం:శ్రీ స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది.అక్కమహాదేవి అలంకార మండపంలో కల్యాణోత్సవం నేత్రానందంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి గం.12.00 లకు శ్రీ స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం మనోహరంగా జరిపారు
.కనుల పండువగా జరిగిన ఈ కల్యాణోత్సవంలో స్వామివారు పట్టువస్త్రాన్ని ధరించి, తలపై ఒకవైపు గంగమ్మను, మరొకవైపు నెలవంకను, మెడలో అభరణాలు, నుదుట విభూతి రేఖలను, పట్టువస్త్రాలను ధరించి పెండ్లికుమారుడుగా ముస్తాబు అయ్యారు.
కాగా అమ్మవారు కూడా పట్టువస్త్రాలను ధరించి, నుదుట కల్యాణ తిలకాన్ని, బుగ్గన చుక్కను, సర్వాభరణాలను ధరించి పెండ్లికుమార్తె అయి స్వామికి సరిజోడనిపించుకున్నారు. మంగళతూర్యనాదాలతో, వేదమంత్రాల నడుమ నేత్రానందంగా ఈ కల్యాణోత్సవం జరిగింది .
ఈ కల్యాణోత్సవంలో లోకకల్యాణాన్నికాంక్షిస్తూ ముందుగా అర్చకస్వాములు కల్యాణోత్సవ సంకల్పాన్ని తరువాత కల్యాణోత్సవం నిర్విఘ్నంగా జరగాలని గణపతిపూజ జరిపారు. ఆ తరువాత వృద్ధి అభ్యుదయాల కోసం పుణ్యహవచనం చేశారు.
తరువాత కంకణపూజను అనంతరం యజ్ఞోపవీతపూజ చేసి స్వామివారికి కంకణధార, యజ్ఞోపవీతధారణ చేసారు. అనంతరం సప్త ఋషుల ప్రార్థన చేసి కన్యావరణ మంత్రాలను ఆ తరువాత స్వామివారికి వరపూజను అనంతరం స్వామిఅమ్మవార్ల ప్రవర పఠనాన్ని చేశారు.
తరువాత స్వామివారికి మధువర్కం సమర్పించబడి, శ్రీస్వామిఅమ్మవార్లకు వస్త్రాలను సమర్పించారు. తరువాత బాషికధారణ కార్యక్రమం ఆ తరువాత గౌరీపూజ జరిపారు.
స్వామిఅమ్మవార్ల మధ్య తెర సెల్లను ఏర్పరచి మహాసంకల్ప పఠనం అనంతరం సుముహూర్త సమయంలో స్వామిఅమ్మవార్లకు జీలకర్ర, బెల్లం సమర్పించారు. ఆ తరువాత మాంగల్యపూజను జరిపించి అమ్మవారికి మాంగల్యధారణ జరిగింది. తరువాత తలంబ్రాలు, బ్రహ్మముడి కార్యక్రమాలను జరిపి భక్తులకు ఆశీర్వచనాన్ని అందించారు.
*ఓం నమ:శ్శివాయ🙏
DATE: 16-02-2026
TIME: (12:30 AM TO 01:30
AM) TEMPLE PILGRIMS COUNTING = 5,864
KIALASA DWARAM PILGRIMS COUNTING =4
ANNADHNAM PEOPLE COUNTING = 375
TOTAL
COMPARTMENT STATUS =16
FREE COMPARTMENT=10
200 COMPARTMENTS = 04
500 COMPARTMENT (ALANKARAM) =02
FREE COMPARTMENTS PRASADAM =
DARSHANAM= curd rice
ALANKARA DARSHANAM
DATE: 16-02-2026
TIME: (12:30 AM TO 01:30
AM) TEMPLE PILGRIMS COUNTING = 5,864
KIALASA DWARAM PILGRIMS COUNTING =4
ANNADHNAM PEOPLE COUNTING = 375
TOTAL
COMPARTMENT STATUS =16
FREE COMPARTMENT=10
200 COMPARTMENTS = 04
500 COMPARTMENT (ALANKARAM) =02
FREE COMPARTMENTS PRASADAM =
DARSHANAM= curd rice
ALANKARA DARSHANAM
