
Good Arrangements for Maha kumbhabhishekam in Srisaila Devasthaanam:
ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 21 వ తేదీ వరకు మహాకుంభాభిషేక మహోత్సవం జరుగనుంది.
16 ఉదయం గం.7.00లకు మహాకుంభాభిషేక సంకల్పం, గోపూజ, గణపతిపూజ, ఋత్విగ్వరణం, దీక్షాధారణ, పర్యగ్నికరణము, యాగశాల ప్రవేశం, పుణ్యాహవాచనం, పంచగవ్యప్రాశన, మండపారాధనలు మూలమంత్రానుష్ఠానాలు, పారాయణలు, అఖండదీపస్థాపన జరుగుతాయి. ప్రతీరోజు కూడా మహాకుంభాభిషేక సంబంధి కార్యక్రమాలు వుంటాయి.
ఉదయం స్వర్ణరథ సమర్పణ మహోత్సవ కార్యక్రమము కూడా జరుగనుంది. రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి ఈ స్వర్ణరథాన్ని విరాళంగా సమర్పిస్తున్నారు.
బంగారు రథానికి సంప్రోక్షణ, ప్రారంభోత్సవపూజా కార్యక్రమాలు, ఆ తరువాత రథశాల నుంచి నందిగుడి వరకు బంగారు స్వర్ణరథోత్సవం జరుగనున్నాయి.