శ్రీశైల దేవస్థానం:మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాదయాత్రగా శ్రీశైలానికి చేరుకుంటున్నారు.
పాదయాత్రగా వచ్చే భక్తులు ఆత్మకూరు పట్టణాన్ని చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో వెంకటాపురం చేరుకుంటున్నారు.
వెంకటాపురం నుంచి అటవీమార్గంలో గోసాయికట్ట, నాగలూటి, దామెర్లకుంట, పెద్ద చెరువు, మఠంబావి, భీమునికొలను, కైలాసద్వారం మీదుగా శ్రీశైలాన్ని చేరుకుంటారు.
అటవీశాఖ సహకారంతో కాలిబాట మార్గంలో దేవస్థానం పలు ఏర్పాట్లు చేసింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పలుచోట్ల వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసింది.
పాదయాత్రతో వచ్చే భక్తుల సౌకర్యార్థం దేవస్థానం అటవీ మార్గమంతా కూడా భాషలలో సూచిక బోర్డులను ఏర్పాటు చేసింది. పలుచోట్ల మార్గం తెలిపేవిధంగా మ్యాపుల బోర్డులు కూడా ఏర్పాటు చేసారు. ఈ మ్యాపు బోర్డులను కూడా మూడు భాషలలో ఏర్పాటు చేశారు . ఈ మ్యాపులలో ఆయా ప్రదేశాలలో ఏర్పాట్లు కూడా ఉన్నాయి.
ఏర్పాట్లలో భాగంగా వెంకటాపురం వద్ద చలువపందిర్లు ఏర్పాటు అదేవిధంగా అక్కడ తాత్కాలిక శౌచాలయాలు కూడా ఏర్పాటు వుంది. భక్తులు మజిలీ చేసేందుకు వీలుగా నాగలూటి వద్ద కూడా చలువ పందిర్లు వేశారు. అక్కడ నీటి కోనేర్లను కూడా శుభ్రపరిచారు. నాగలూటి వద్ద జనరేటర్లతో తాత్కాలిక విద్యుద్దీకరణ కూడా చేశారు. కాలిబాట మార్గంలోని దామెర్లకుంట, పెద్దచెరువు వద్ద కూడా చలువపందిర్లు, తాత్కాలిక శౌచాలయాలు కూడా ఏర్పాటు చేశారు.
దామెర్లకుంట, పెద్దచెరువు ప్రదేశాలకు దేవస్థానం ట్రాక్టర్ల ద్వారా కూడా నీటిసరఫరా చేస్తున్నారు.
భీమునికొలను నుంచి కైలాసద్వారం మెట్లమార్గం వరకు తాత్కాలిక నీటిపైపు వేసి మంచినీటి కుళాయిలను ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో ఆరు చోట్ల 1000లీటర్ల సామర్థ్యం గల నీటి ట్యాంకులను ఏర్పాటు చేశారు.
అదేవిధంగా కైలాసద్వారం వద్ద 20వేల లీటర్ల సామర్థ్యపు శాశ్వత మంచినీటి ట్యాంకు (ఆర్.సి.సి ట్యాంకు) కు నిరంతరం మంచినీటిని సరఫరా జరుగుతోంది
వీటికి అదనంగా కైలాసద్వారం వద్ద 5 వేల లీటర్ల సామర్థ్యం గల 8 సింటెక్సు ట్యాంకులు ఏర్పాటు చేశారు