శ్రీశైల దేవస్థానం:దేవస్థానానికి ఆదివారం శ్రీమతి కోనేరు విమలాదేవి , వారి కుటుంబ,సభ్యులు చెన్నై బంగారు పళ్లెమును సమర్పించారు.343 గ్రాములతో ఈ బంగారు పళ్ళెమును తయారు చేయించినట్లు దాతలు తెలిపారు. అమ్మవారి ఆలయ ప్రాంగణములోని ఆశీర్వచన మండపంలో కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజుకు ఈ పళ్లెమును అందించారు.అనంతరం దాతలకు శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలను ప్రసాదాలను, స్వామిఅమ్మవార్ల జ్ఞాపికను అందించారు.
ఈ కార్యక్రమం లో ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. హరిదాసు, అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు పి. మార్కండేయశాస్త్రి, సీనియర్ వేదపండితులు గంటి రాధకృష్ణశర్మ, పర్యవేక్షకులు జి. స్వాములు తదితరులు పాల్గొన్నారు.విరాళంగా ఇచ్చిన శ్రీమతి కోనేరు విమలాదేవి , కుటుంబ,సభ్యులు,చెన్నై