శ్రీశైల దేవస్థానం: జే. సీ. అస్మిత్ రెడ్డి , శాసనసభ్యలు , జె.సి. ప్రభాకరరెడ్డి, తాడిపత్రి, అనంతపురం జిల్లా వారు 379 గ్రాములతో తయారు చేయించిన బంగారు కూర్మ సింహాసనం, మరియు 249 గ్రాములతో తయారు చేయించిన బంగారు పళ్ళెమును దేవస్థానమునకు సమర్పించారు.
అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో దాతలు ఈ కూర్మ సింహాసనం,ఈ పళ్ళెమును కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు, అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు మార్కండేయస్వామి వార్లకు అందించారు.వారికి వేదాశీర్వచనముతో శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలు అందించారు.
ఈ కార్యక్రమములో సహాయ కార్యనిర్వహణాధికారి బి. మల్లికార్జునరెడ్డి, ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు , పర్యవేక్షకులు సి. మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.