×

ఏ ఒక్క భక్తుడి నుంచి కూడా ఫిర్యాదు లేకుండా సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించాలి-ఈ ఓ

ఏ ఒక్క భక్తుడి నుంచి కూడా ఫిర్యాదు లేకుండా సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించాలి-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం: ఏ ఒక్క భక్తుడి నుంచి కూడా ఫిర్యాదు లేకుండా సిబ్బంది అందరు సమర్థవంతంగా విధులు నిర్వహించాలన్నారు ఈ ఓ. భక్తులకు కల్పించాల్సిన మరిన్ని సౌకర్యాలను గురించి ఈ ఓ ఎస్.లవన్న  శనివారం  సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఉభయదేవాలయాల ప్రధానార్చకులు, స్వామివారి ఆలయ ఉప ప్రధానార్చకులు, అన్ని విభాగాల యూనిట్ అధికారులు,  పర్యవేక్షకులు ఈ సమావేశం లో పాల్గొన్నారు. ఈ ఓ  మాట్లాడుతూ ఎండవేడిమి కారణంగా భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆయా విభాగాలను ఆదేశించారు. క్యూలైన్లలో నిరంతరం మంచినీరు, అల్పాహారాన్ని అందిస్తుండాలన్నారు. రద్దీ అంతగాలేని సాధారణ రోజులలో కూడా క్యూలైన్లలో మంచినీరు, అల్పాహారాలను యథావిధిగా అందజేయాలన్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే పర్వదినాలు,  సెలవు రోజులను ముందుగానే గుర్తించి తదనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.

క్యూలైన్లలో భక్తులు అధిక సమయం వేచివుండకుండా వుండేవిధంగా దర్శనవిధానాన్ని రూపొందించాలని ఆలయ, ప్రజాసంబంధాలు,  భద్రతా విభాగాన్ని ఈ ఓ  ఆదేశించారు. ఈ విషయమై ప్రత్యేక నివేదికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆర్జిత సేవాటికెట్లను కూడా భక్తులు ఎక్కువ సమయం వేచివుండకుండా పొందేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.దేవస్థానం వసతి గదులు, కాటేజీలు ఖాళీ అయినప్పుడు ఎటువంటి ఆలస్యం లేకుండా వాటిని శుభ్రపరుస్తుండాలని ఆదేశించారు. దీనివలన వసతి పొందగోరే భక్తులు ఎక్కువ సమయం వేచివుండకుండా వసతి పొందే అవకాశం ఉందన్నారు.

దేవస్థానం క్యూకాంప్లెక్స్, క్యూలైన్లు, వసతిగదులు మొదలైనవాటిలో ఏమైనా మరమ్మతులు అవసరమైనప్పుడు ఎటువంటి ఆలస్యం లేకుండా ఆయా పనులు చేయాలన్నారు ఈ ఓ.పర్వదినాలు, వారాంతపు రోజులలో భక్తులరద్దీ ఎక్కువగా ఉంటుందని,  దేవస్థానం డార్మెటరీ ప్రాంగణాలలో మరికొన్ని స్నానపు గదులు,  శౌచాలయాల నిర్మాణాలకు అంచనాలను రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.ఏ ఒక్క భక్తుడి నుంచి కూడా ఫిర్యాదు లేకుండా సిబ్బంది అందరు సమర్థవంతంగా విధులు నిర్వహించాలన్నారు.

 దేవస్థాన విరాళపథకాలైన కుటీర నిర్మాణపథకం, గో సంరకణపథకం, అన్నదాన పథకం, ప్రాణదానట్రస్ట్ మొదలైన విరాళాల పథకాల గురించి మరింత ప్రచారం కల్పించాలన్నారు ఈ ఓ.ఆయా పథకాలకు భక్తులు సులభంగా విరాళాలు చెల్లించేందుకు వీలుగా, దాతలకు ఆయా సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక విభాగాన్ని (

డోనర్స్ సెల్) ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దేవస్థానం నిర్వహిస్తున్న నిత్యపరోక్షసేవలు, లక్షకుంకుమార్చన, బయలు వీరభద్రస్వామి విశేషపూజలు, నందీశ్వరస్వామివారికి విశేష పూజలు మొదలైన ప్రత్యేక పరోక్షసేవల గురించి గురించి కూడా ముందస్తుగానే ప్రచారం కల్పించాలన్నారు.దీనివలన శ్రీశైలక్షేత్రానికి స్వయంగా రాలేని భక్తులు ఆయా సేవలను పరోక్షంగా జరిపించుకునే అవకాశం ఉంటుందన్నారు.

print

Post Comment

You May Have Missed