
తిరుపతి, 2022 నవంబరు 27 ;గీతా జయంతి సందర్భంగా హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఆదివారం భగవద్గీత కంఠస్థం పోటీలు జరిగాయి.700 శ్లోకాలు కంఠస్థం వచ్చిన వారిలో రెండు కేటగిరీలలో అనగా 18 సంవత్సరాల వారు ఒక కేటగిరి, 18 సంవత్సరాల పైవారు రెండవ కేటగిరి గాను మరియు నాలుగవ అధ్యాయం జ్ఞాన యోగం లో 6, 7 తరగతి ఒక కేటగిరి గాను, 8,9 తరగతులు రెండవ కేటగిరి గాను పోటీలు నిర్వహించారు. తిరుపతి చుట్టుపక్కల వారికి ఈ పోటీలు నిర్వహించారు.700 శ్లోకాలు క్యాటగిరిలో 18 మంది, నాలుగవ అధ్యాయం లో 180 మంది తిరుపతిలోని అన్ని పాఠశాల నుండి పాల్గొన్నారు . పోటీల నిర్వహణలో 12 మంది న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమాన్ని హిందూ ధార్మిక ప్రాజెక్ట్స్ అధికారి శ్రీమతి విజయలక్ష్మి ఆధ్వర్యంలో, ఎస్వీ ప్రాచ్య కళాశాల లెక్చరర్ హేమంత్ కుమార్ నిర్వహించారు.
విజేతలకు డిసెంబర్ 4న జరిగే గీతా జయంతి వేడుకలలో బహుమతి ప్రదానం చేస్తారు.
విజేతల వివరాలు
6,7 తరగతులు –
1. నాగమల్లేశ్వరి KBSSP Sank. School
2. భవ్య శ్రీ , శ్రీ వెంకటేశ్వర చిల్డ్రన్స్ హై స్కూల్
3. భువన శ్రీ, ఎస్పీ గర్ల్స్ హై స్కూల్
8,9 తరగతులు
1. పి నందకిషోర్, ఎస్ జి ఎస్ స్కూల్ తిరుపతి
2. ఏ రజిత్, లిటిల్ ఏంజెల్స్
3. జే శ్రావణి ,ఎస్పీ గర్ల్స్ హై స్కూల్
700 శ్లోకాలు 18 సంవత్సరాల లోపు
1. పి హేమ వెంకటనారాయణ
2. కేపీ శ్రీ ముకుంద
3. జి జీవన్ శ్రీనివాస్
700 శ్లోకాలు 18 సంవత్సరాల తరువాత
1. కె.వి .లక్ష్మీదేవి
2. ఎం .గోపాలకృష్ణ
3. టి. సునీత