శ్రీశైల దేవస్థానం: వినాయకచవితి సందర్భంగా సోమవారం వివిధ కార్యక్రమాలు జరిగాయి. దేవస్థానం ఘనంగా ఏర్పాట్లు చేసింది. అర్చక స్వాములు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఓ తదితర అధికార గణం , సిబ్బంది , భక్తులు పాల్గొన్నారు. ఉదయం గం.7.00లకు శ్రీస్వామివారి యాగశాల లో యాగశాల ప్రవేశం, శ్రీవరసిద్ధి వినాయకవ్రతపూజలు చేసారు. ఉదయం గం. 10.00ల నుండి శ్రీ సాక్షిగణపతి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన శ్రీ మృత్తికా గణపతి స్వామివారికి విశేషపూజలు నిర్వహించారు.ఉదయం గం. 10.30లకు ఉచిత సామూహిక సేవలలో భాగంగా చంద్రవతి కల్యాణ మండపంలో గణపతిపూజ ఘనంగా జరిగింది.