
శ్రీశైల దేవస్థానం:భక్తుల సౌకర్యార్థం ఈ నెల 10న వినాయకచవితి సందర్భంగా సాక్షిగణపతి ఆలయం లో నెలకొల్పనున్న వరసిద్ధివినాయకస్వామివారికి ఆర్జిత పరోక్షసేవగా విశేషార్చనను జరిపించుకునే అవకాశం కల్పించారు.
వినాయకచవితి రోజున 8.30గంటల నుండి ఈ పూజాదికాలు ఉంటాయి. కాగా ఈ పరోక్షసేవకు భక్తులు రూ.1,116-00లు రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది.
భక్తులు ఆన్లైన్ ద్వారా సేవారుసుము చెల్లించి పరోక్షసేవగా ఈ గణపతి పూజను జరిపించుకోవచ్చు.
భక్తులు ఆన్లైన్ ద్వారా సేవారుసుము చెల్లించి పరోక్షంగా ఈ గణపతిపూజను జరిపించుకోవచ్చు.
ఈ సేవారుసుమును దేవస్థానం వెబ్ సైట్ – srisailadevasthanam.org లేదా దేవదాయశాఖ వెబ్ సైట్ aptemples.ap.gov.in ద్వారా చెల్లింపు చేయవచ్చు.
సేవాకర్తలు వారి పేరున జరిగే సేవను వీక్షించేందుకు వీలుగా దేవస్థానం యూ ట్యూబ్ ద్వారా ఈ గణపతి పూజను అనంతర ప్రసారం (రికార్డెడ్ ప్రసారం) చేస్తారు.
పూజల అనంతరం సేవాకర్తలకు పోస్టు ద్వారా ప్రసాదం పంపుతారు.
ఈ పరోక్షసేవ గురించి మరిన్ని వివరాలను దేవస్థానం కాల్ సెంటర్ ద్వారా (ఫోన్ నెం: 83339 01351/52/53/54/55/56) ద్వారా పొందవచ్చు.