
శ్రీశైల దేవస్థానం: వినాయకచవితి పురస్కరించుకుని సెప్టెంబరు 10 వతేదీ నుండి 19.09.2021 వరకు గణపతి నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయి.
ఈ ఉత్సవాల సమయంలో ఆలయప్రాంగణంలోని రత్నగర్భగణపతిస్వామి వారికి, శ్రీశైలం సమీపంలోని సాక్షిగణపతిస్వామివారికి , యాగశాలలో వేంచేబు చేయించనున్న గణపతిస్వామివారి పంచలోహమూర్తికి ప్రతినిత్యం వ్రతకల్పవిశేషార్చనలు నిర్వహిస్తారు.
అదేవిధంగా శ్రీ సాక్షిగణపతి ఆలయం వద్ద మృత్తికా గణపతిని (మట్టితో చేసిన వినాయకుని విగ్రహాన్ని) కూడా నెలకొల్పి ఉత్సవ సమయంలో ప్రతీరోజు వ్రతకల్పపూర్వకంగా పూజాదికాలను నిర్వహిస్తారు.
సెప్టెంబరు,10తేదీ, వినాయకచవితి రోజున ఉదయం గం.8.00గంటలకు ఈ గణపతి నవరాత్రోత్సవాలు ప్రారంభమవుతాయి .