శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఏడవ రోజు మంగళవారం శ్రీస్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి.
యాగశాల లో శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపారు. అనంతరం లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు చేశారు.
అనంతరం మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి, నిత్యహవనాలు, రుద్రహోమం, చండీహోమం, కార్యక్రమాలు శాస్త్రం ప్రకారంగా జరిగాయి
ఈ సాయంకాలం ప్రదోష కాల పూజలు, జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు, హోమాలు జరిగాయి.
గజవాహన సేవ:
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు రాత్రి శ్రీస్వామిఅమ్మవార్లకు గజవాహనసేవ జరిపారు.
ఈ సేవలో శ్రీ స్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో గజవాహనంపై వేంచేబు చేయించి ప్రత్యేక పూజాదికాలు జరిపారు.
గ్రామోత్సవంలో నాదస్వరం, కోలాటం, చెక్కభజన, రాజభటులవేషాలు, కేరళ చండీమేళం, కొమ్ముకొయ్య నృత్యం, ముంబాయ్ డోల్ థేష్, విళక్కు, స్వాగత నృత్యం, వీరభద్రడోలు కుణిత, జాంజ్ పథక్ ( కర్ణాటక డోలు) కాళికా నృత్యం, జానపద పగటి వేషాలు, నందికోలు సేవ, గొరవనృత్యం, తప్పెటచిందు, బీరప్పడోలు, నందికోలసేవ, ఢమరుకం, చిడతలు, శంఖం, పిల్లనగ్రోవి, డోలు విన్యాసం, గిరిజన చెంచు నృత్యం తదితర కళారూపాలను గ్రామోత్సవంలో ఏర్పాటు చేశారు.
ఈ ఓ పర్యవేక్షణలో కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి.
*Culture programme (Pravachanam) at Pushkarini Stage
*శ్రీశైలం/ నంద్యాల : రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ దంపతులు రెండు రోజుల శ్రీశైలం పర్యటన ముగించుకొని ఈ ఉదయం 11:35 నిమిషాలకు సున్నిపెంట హెలిపాడ్ మైదానం నుంచి విజయవాడకు బయలుదేరి వెళ్లారు.రాష్ట్ర గవర్నర్ కు రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, కర్నూల్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ ఘనంగా వీడ్కోలు పలికారు.
శ్రీశైలం – నంద్యాల: పాగాలంకరణ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి పలు సూచనలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా, నంద్యాల జిల్లా ఇంచార్జి ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా జరగనున్న ముఖ్యమైన పాగాలంకరణ కార్యక్రమానికి కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
పాగాలంకరణలో రాజకీయ నాయకులు, పుర ప్రముఖులు, భక్తులు, ప్రజలు రానున్న సందర్భంగా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, ప్రేక్షకులు కూర్చునే ప్రదేశాలను , ప్రేక్షకులు వచ్చే ప్రదేశాలలో ఎలాంటి తొక్కిసలాటకు, అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా.
భక్తులు కూర్చునేందుకుకు అన్ని సదుపాయాలు కల్పించాలి.
అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా ఇంచార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్.
అనంతరం స్వామి అమ్మవార్ల గజవాహన సేవలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా , జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్