నయనానందకరంగా గజవాహనసేవ

శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో సోమవారం   శ్రీస్వామిఅమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి.

యాగశాల లో  శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపారు. అనంతరం లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు చేసారు.అనంతరం మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి, నిత్యహవనాలు, రుద్రహోమం, చండీహోమం, కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారంగా నిర్వహించారు.

 సాయంకాలం ప్రదోష కాల పూజలు, జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు, హోమాలు జరిగాయి.

గజవాహన సేవ:

 ఈ రోజు రాత్రి శ్రీస్వామిఅమ్మవార్లకు గజవాహనసేవ నయనానందకరంగా జరిగింది.

ఈ సేవలో శ్రీ స్వామిఅమ్మవారి ఉత్సవ మూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో గజవాహనంపై వేంచేబు చేయించి ప్రత్యేక పూజాదికాలు జరిపారు. తరువాత శ్రీశైలక్షేత్ర ప్రధాన వీధులలో గ్రామోత్సవం జరిపారు. కోలాటం, చెక్కభజన, రాజబటులవేషాలు, జాంజ్ పథక్, జానపద పగటి వేషాలు, గొరవనృత్యం, బుట్టబొమ్మలు, తప్పెటచిందు బీరప్పడోలు, చెంచునృత్యం, నందికోలసేవ, డమరుకం, చితడలు, శంఖం,పిల్లన్నగ్రోవి తదితర కళారూపాలను గ్రామోత్సవంలో ఏర్పాటు చేసారు.

రథ శిఖర కలశానికి పూజాదికాలు:

 మార్చి 2వ తేదీన రథోత్సవం జరుగనున్నది.ఈ సందర్భంగా సోమవారం రథ శిఖర కలశానికి ఆలయములో పూజాదికాలు జరిగాయి. ఈ పూజల అనంతరం రథ శిఖర కలశాన్ని సంప్రదాయబద్ధంగా రథం వద్దకు చేర్చారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.