తిరుపతి, 2023 నవంబరు 14: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు మంగళవారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు గజ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు.
అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.
వాహనసేవల్లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి దంపతులు, ఈవో ఎవి ధర్మారెడ్డి, చంద్రగిరి ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, బోర్డు సభ్యులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, యానాదయ్య, నాగసత్యం, సుధీర్ కుమార్, తిప్పేస్వామి, శేషుబాబు, ఆర్ వి దేశ్ పాండే, సుబ్బరాజు, ఉదయ బాను, జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్ఓ నరసింహ కిషోర్,ఆలయ డెప్యూటీ ఈవో గోవిందరాజన్, సిఇ నాగేశ్వరరావు, ఆలయ డెప్యూటీ ఈవో గోవింద రాజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.