శ్రీశైల దేవస్థానం: హైదరాబాద్ కు చెందిన బి.పర్వతయ్య, శారదా దంపతులు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం స్వామివార్ల లింగోద్భవకాల అభిషేకానికి వివిధ రకాల పండ్లను, డైపుట్స్ తదితర వాటిని సమర్పించారు. 3 వేల తమలపాకులు, 500 అరటిపండ్లు, 400 బత్తాయిపండ్లు, 400 కమలాపండ్లు, 400 సపోటా పండ్లు, 35 కేజీల నల్లద్రాక్ష, 35 కేజీలు ద్రాక్ష, 100 చెరుకుగడ్డలు, 150 కొబ్బరిపాల డబ్బాలు, 100 ఫైనాఫిల్స్, 120 యాపిల్ పండ్లు, 10 డజన్లు దానిమ్మపండ్లు, 130 జామపండ్లు అందజేశారు. ఇంకా పలు రకాల డ్రైఫ్రూట్స్ కూడా అందించారు.బ్రహ్మోత్సవ కల్యాణ తలంబ్రాల ముత్యాలను కూడా అందించారు. ఇంకా పట్టువస్త్రాలను కూడా సమర్పించారు. గతంలో అల్యూమినియంతో తయారు చేసిన, గిన్నెలు, బకెట్లు,
జాలిగరిటెలు మొదలైన పాత్రలను కూడా వస్తువులను లడ్డు ప్రసాదాలకు అవసరమైన వస్తువులను సమర్పించారు.
దేవస్థానములో వీరు కుటీరనిర్మాణ పథకంలో ఒక కాటేజీని కూడా నిర్మించారు. ప్రస్తుతం పూర్తి రాతి నిర్మాణంగా అమ్మవారి యాగశాలను కూడా నిర్మిస్తున్నారు.