ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం శుభం-శ్రీమతి కె.జయమ్మ
కర్నూలు, ఆగస్టు 28:-జర్నలిస్టు పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, కిమ్స్ ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం శుభపరిణామని సమాచార శాఖ ఉపసంచాలకులు కె. జయమ్మ పేర్కొన్నారు.శనివారం సమాచార శాఖ కార్యాలయ ప్రాంగణంలో
జర్నలిస్టు పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, కిమ్స్ ఆసుపత్రి వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
సమాచార శాఖ ఉపసంచాలకులు కె. జయమ్మ మాట్లాడుతూ ప్రస్తుత కోవిడ్ విపత్కర పరిస్థితులలో జర్నలిస్ట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయమన్నారు. ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు రాబోయే రోజులలో మరిన్ని ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం వారికి, జర్నలిస్ట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారికి ధన్యవాదాలు తెలిపారు.
జర్నలిస్ట్ పెన్షనర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ టి. విజయ్ మాట్లాడుతూ వైద్య శిబిరంలో కార్డియాలజీ స్క్రీన్ చెకప్, ఏకో 2 D, ఈసీజీ, రాండమ్ బ్లడ్ టెస్ట్,షుగర్ బీపీ టెస్టులు, వంద మందికి ఒక్కొక్కరికి 2,500 రూపాయల విలువ గల టెస్టులు చేయడం జరిగిందన్నారు.వైద్య శిబిరంలో జిల్లాలోని పాత్రికేయులు వారి కుటుంబ సభ్యులు, సమాచార శాఖ సిబ్బంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు .కిమ్స్ ఆస్పత్రి డాక్టర్ సి.రాజ్ కుమార్, కార్డియాలజిస్ట్ ఎం డి, డి ఎం, ఈవైద్య శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకొని చిన్న చిన్న సమస్యలు ఉన్నవారికి మెరుగైన వైద్యం కొరకు సూచనలు సలహాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కిమ్స్ ఆస్పత్రి మార్కెటింగ్ సిబ్బంది, టెక్నీషియన్లు తదితరులు పాల్గొన్నారు.
Post Comment