*కృష్ణమ్మకు పూజా కార్యక్రమం నిర్వహించి జల హారతి ఇచ్చి సారే, రవిక, పసుపు కుంకుమను సమర్పించిన శ్రీశైలం ఎమ్మెల్యే, శ్రీశైలం దేవస్థానం ఈవో :-
జలాశయ గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 882.10 అడుగులు, 199.7354 టిఎంసీలకు చేరుకోవడంతో రెండు గేట్ల ద్వారా 53,488 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల :-
బిరబిరా పరుగులేడుతున్న కృష్ణమ్మ :-
కర్నూలు/శ్రీశైలం ప్రాజెక్ట్ : – శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో ఈ రోజు రాత్రి శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, శ్రీశైలం దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు, శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు కృష్ణమ్మకు పూజా కార్యక్రమం నిర్వహించి జల హారతి ఇచ్చి సారే, రవిక, పసుపు కుంకుమను సమర్పించి జలాశయం రెండు గేట్లను పది అడుగులు పై కెత్తి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేశారు.
ఈ రోజు రాత్రి గేట్లు ఎత్తే సమయానికి శ్రీశైలం జలాశయానికి దాదాపు 4 లక్షల క్యూసెక్కుల పైగా నీరు వస్తోంది. 53,488 క్యూసెక్కుల నీటిని రెండు గేట్లు పది అడుగుల మేర పైకెత్తి అధికారులు కిందికి నీటిని విడుదల చేయడంతో బిరబిరా కృష్ణమ్మ నాగార్జునసాగర్ వైపున కు ఉరకలు వేస్తూ పరుగులేడుతుంది. జలాశయ గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 882.10 అడుగులు, 199.7354 టిఎంసీలకు చేరుకోవడంతో రెండు గేట్లను 10 అడుగులు పై కెత్తి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేశారు.