కోవిడ్ కట్టడికి ఐదు కమిటీలు-జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్

కర్నూలు, జూన్ 6: జిల్లాలో కోవిడ్ ను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు ఐదు జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ తెలిపారు.జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ , రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి,జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జీలానీ సామూన్, జాయింట్ కలెక్టర్ (ఆసరా,  సంక్షేమం) శ్రీనివాసులు, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ డి.కె.బాలాజీ, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ,డ్వామా పిడి అమర్నాథ్ రెడ్డి, కర్నూల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ జిక్కి, , డి ఆర్ ఓ పుల్లయ్య, జెడ్పి సీఈఓ వెంకటసుబ్బయ్య, డిఎమ్ హెచ్ ఓ రామగిడ్డయ్య, డిఆర్డీఏ పిడి వెంకటేశులతో పాటు ఈ ఐదు కమిటీల సభ్యులతో కలెక్టర్ ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

కలెక్టర్ మాట్లాడుతూ థర్డ్ వేవ్ ప్రిపరేషన్స్, వంద శాతం కోవిడ్ వ్యాక్సినేషన్, శాంపిల్ సేకరణ,టెస్టింగ్ పెంపుదల, పోస్ట్ కోవిడ్ 19 హెల్త్ మేనేజ్మెంట్, యాక్షన్ ఫర్ అన్ లాక్ అనే అంశాలపై ఐదు జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేశామన్నారు..

థర్డ్ వేవ్ ప్రిపరేషన్స్ కమిటీ సంబంధించి మూడవ దశను ఎదుర్కునేందుకు ఎలాంటి చర్య తీసుకుంటే బాగుంటుంది , టెస్టింగ్ , వ్యాక్సినేషన్ , మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ పెంపు, ట్రీట్మెంట్, ప్రివెన్షన్ అవగాహన కార్యక్రమాల రూపకల్పన ఏ విధంగా చేయాలో చర్చించాలన్నారు. మూడో దశలో చిన్న పిల్లలపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటున్నారు కాబట్టి ఆ దిశగా కూడా చర్యలు తీసుకునేందుకు ఐసిడిఎస్ పిడి డిఆర్డిఏ పిడి తదితరులను కమిటీలో వే శామన్నారు..

100% వ్యాక్సినేషన్ కమిటీ అర్హులైన వారందరికీ100% వాక్సినేషన్ వేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ ,45 ఏళ్లు నిండిన వారందరికీ 100% వ్యాక్సినేషన్ కవర్ చేసే విధంగా ప్రణాళికలు ఉండాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో 51% ఫస్ట్ డోస్ వేశామన్నారు ,ఇరవై ఒక్క శాతం మందికి రెండో వేశామన్నారు ,49 శాతం మందికి ఫస్ట్ డోస్, 79 శాతం మందికి రెండవ డోసు వేయాల్సిఉందన్నారు .మూడో దశ నుంచి బయటపడాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని కలెక్టర్ అభిప్రాయపడ్డారు . మన వద్ద లభ్యంగా ఉన్న వ్యాక్సిన్తో అవసరమైన వారందరికీ వ్యాక్సిన్ వేసే విధంగా ప్లాన్ చేయాలన్నారు.

శాంపిల్ కలెక్షన్ టెస్టింగ్ కమిటీ ప్రతిరోజు ఖచ్చితంగా 8000 టెస్టులు జరిగేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. టెస్టింగ్ చేసే కెపాసిటీ ఉన్నప్పటికీ శాంపిల్ కలెక్షన్ తక్కువగా ఉండటం వల్ల టెస్టులు చేయలేకపోతున్నామన్నారు ..ఎక్కువ టెస్టులు చేస్తేనే ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తులను గుర్తించగలమని, తద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని కలెక్టర్ అన్నారు. తద్వారా పాజిటివిటీ, మరణాల శాతం తగ్గుతాయన్నారు. కేసులు తగ్గాయని , నిర్లక్ష్యం పనికి రాదన్నారు.. కమిటీ సభ్యులు ఈ అంశంపై చర్చించి పదివేల శాంపిల్స్ సేకరించి, రోజుకు ఎనిమిది వేల టెస్టులు జరిగేలా చూడాలన్నారు. ఫలితాలను కూడా వెంటనే ప్రకటించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

పోస్ట్ కోవిడ్ హెల్త్ మేనేజ్మెంట్ కమిటీ కోవిడ్ తరువాత వచ్చే పరిణామాలను విశ్లేషించి అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు . బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్, ఇతర అనారోగ్యాలు వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించి ప్రణాళికలు రూపొందించాలన్నారు.

యాక్షన్ ఫర్ అన్లాక్ కమిటీ అన్లాక్ తర్వాత ఏ రకంగా చేస్తే బాగుంటుంది సూచనలు ఇవ్వాల ని, వీటన్నింటినీ క్రోడీకరించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపుతామన్నారు.

ఐదు కమిటీలు సభ్యులతో రేపు ఉదయం అంతర్గత సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఆయా అంశాలపై చర్చించి యాక్షన్ ప్లాన్ తయారు చేయాలన్నారు. రేపు మధ్యాహ్నం వి సి లో ఈ యాక్షన్ ప్లాన్ల పై చర్చించి జిల్లాలో కోవిడ్ను పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు ఏం చేయాలో ఒక నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.

కోవిడ్ కట్టడి కమిటీల్లో సభ్యుల వివరాలు

థర్డ్ వేవ్ ప్రిపరేషన్స్ జిల్లా స్థాయి కమిటీలో జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఉంటారు.. జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్, జాయింట్ కలెక్టర్ వెల్ఫేర్, కర్నూల్ నగర పాలక సంస్థ కమిషనర్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ,జిజిహెచ్ సూపరింటెండెంట్ , డి ఎం హెచ్ ఓ , డి ఆర్ ఓ, ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్, ఎపి డెమాలజిస్ట్ శుభప్రద, పీడియాట్రీషియన్ రమాదేవి, ఫుడ్ ఇన్స్పెక్టర్ , డి.ఎస్.ఒ , లీగల్ మెట్రాలజీ డిప్యూటీ కంట్రోలర్ ,ఐటీడీఏ ఏపీవో, ఏ పీ ఎస్ ఎం ఐ డి సి ఈ ఈ, ఐ సి డి ఎస్ పిడి, డి ఆర్ డి ఏ పిడి, డీఈవో ,నంద్యాల బర్డ్ సీఈవో,  ప్రెసిడెంట్ పౌల్ రాజారావు సభ్యులు గా కమిటీలో ఉంటారు.

100% వ్యాక్సినేషన్ కమిటీకి కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ టీమ్ లీడర్ గా ఉంటారు.డి ఐ ఓ, డి ఎం హెచ్ వో ,జడ్పీ సీఈఓ,డిఆర్డిడిఎ పిడి , డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ సభ్యులుగా ఉంటారు.

శాంపిల్ కలెక్షన్స్, టెస్టింగ్ పెంపుదల కమిటీలో డ్వామా పిడి టీం లీడర్ గానూ, అసిస్టెంట్ కలెక్టర్ ,డీఎంహెచ్వో ,డి ఐ ఓ, డిఆర్డి డిఎ పిడి ,మెడికల్ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ , ఐటిడిఎ ఏపిఓ సభ్యులుగా ఉంటారు.

పోస్ట్ కోవిడ్ 19 హెల్త్ మేనేజ్మెంట్ కమిటీ లో కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ టీం లీడర్ గా ఉంటారు. జిజిహెచ్ సూపరింటెండెంట్, డి ఎం హెచ్ ఓ, నంద్యాల డి సి హెచ్ ఎస్ సభ్యులుగా ఉంటారు.

యాక్షన్ ఫర్ అన్లాక్ కమిటీలో కర్నూల్ నగరంపాలక సంస్థ కమిషనర్ టీం లీడర్ గా ఉంటారు. సభ్యులుగా రెడ్ sanders టాస్క్ఫోర్స్ డి.ఎస్.పి రాజీవ్ కుమార్, జెడ్పి సీఈఓ ,,డి పి ఓ ,జి ఎం పరిశ్రమల శాఖ, మార్కెటింగ్ ఏ డి, కార్మిక శాఖ డి సి సభ్యులుగా ఉంటారు.

print

Post Comment

You May Have Missed