శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానంలో అన్నప్రసాద వితరణ విభాగం లో పొరుగుసేవల విభాగంలో విధులు నిర్వహిస్తున్న బి. రామాంజనేయులు అనారోగ్య కారణంగా 19.12.2022న మరణించారు.ఆ కుటుంబానికి ఆర్థిక సాయంగా సోమవారం శ్రీశైల దేవస్థానం లో ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది వారి నెలవారీ జీతం నుండి ఒకరోజు వేతనం మొత్తాన్ని రూ.2,73,128/-లు డిమాండ్ డ్రాఫ్టుల రూపం లో అందేజేశారు.ఈ మేరకు సంబంధిత డిమాండ్ డ్రాఫ్ట్ను, నగదును మరణించిన ఉద్యోగి భార్య శ్రీమతి బి. లావణ్యకు కార్యనిర్వహణాధికారి చేతుల మీదుగా అందించారు.
*Vendi Rathotsava Seva, Sahasra Deeparchana Seva, Kumara swamy puuja performed in the temple by Archaka swaamulu.