
ఆంధ్రభూమి ఎడిటర్ , సీనియర్ జర్నలిస్ట్ దివంగత ముళ్ళపూడి సదాశివ శర్మ కుటుంబానికి ఆంధ్రభూమి – డెక్కన్ క్రానికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆర్థిక సాయం అందించింది. అసోసియేషన్ తరఫున వెల్జాల చంద్రశేఖర్, బాలకృష్ణ , పి.వీ.రమణా రావు, శివ తదితర నేతలు,సభ్యులు ఇవాళ మధ్యాహ్నం సదాశివ శర్మ ఇంటికి వెళ్లి శర్మ సతీమణి లక్ష్మీ పద్మావతి కి , కుమార్తె చి. శ్రీవిద్య కు 2 లక్షల 6 వేల 520 రూపాయల చెక్కులను అంద జేశారు. ఆంధ్రభూమి – డెక్కన్ క్రానికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులకు , నేతలకు శర్మ ఆత్మీయుడు,సీనియర్ జర్నలిస్ట్ విద్యారణ్య కామ్లేకర్ ధన్యవాదాలు తెలిపారు.