వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి అవసరం- కలెక్టర్ జి.వీరపాండియన్
కర్నూలు, జూన్ 03 :గురువారం సాయంత్రం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ పై జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమీషనర్లు, సబ్ కలెక్టర్, ఆర్ డి ఓలతో జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ మాట్లాడుతూ ఫ్రంట్ లైన్ వర్కర్లు, హెల్త్ కేర్ వర్కర్లు అందరికీ వంద శాతం వ్యాక్సినేషన్ వేయించాలని అధికారులను ఆదేశించారు..మొదటి డోసు వేయించుకొని వారికి మొదటి డోసు, అలాగే మొదటి డోసు వేయించుకొని , రెండవ డోస్ వ్యాక్సిన్ గడువు దగ్గర పడుతున్న వాళ్లకు వ్యాక్సిన్ ఇవ్వాలన్నారు. పి.హెచ్.సి, సి.హెచ్.సి, ప్రైవేట్ హస్పిటల్ లో ఫ్రంట్ లైన్, హెల్త్ కేర్ వర్కర్లు ఎంతమంది మొదటి డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నారు, ఎంతమంది రెండవ డోస్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. మొదటి డోస్ వ్యాక్సిన్ వేయించుకోకుండా ఎంతమంది వున్నారు… సమగ్రంగా డేటా సేకరించుకోని వ్యాక్సినేషన్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టి వ్యాక్సిన్ ఇవ్వాలన్నారు. ఈ రోజు 25 వేల వ్యాక్సిన్ వచ్చిందని రేపు మధ్యాహ్నం లోగా వ్యాక్సిన్ పూర్తి చేయాలని అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని మున్సిపల్ కమీషనర్లకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ధర్డ్ వేవ్ వచ్చే అవకాశం వుందని ఇప్పటికే ఇంగ్లాండ్ లో మొదలైందని చెప్తున్నారని ధర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా ముందస్తుగా సిద్ధంగా వుండాలన్నారు. కోవిడ్ పై విజయం సాధించాలంటే వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏకైక మార్గం అన్నారు. ప్రజల ప్రాణలను కాపాడమే ధ్యేయంగా పనిచేస్తూ 45 సంవత్సరాలు పై బడిన వారందరికీ వ్యాక్సినేషన్ తీసుకునేలా చూడలన్నారు. డోన్, బేతంచర్ల, ప్యాపిలిలో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయని ఆ ప్రాంతంలో వంద శాతం వ్యాక్సిన్ ఇవ్వాలన్నారు. జర్నలిస్ట్, జిల్లా ఆఫీసర్స్ అసోసియేషన్ వారి కుటుంబ సభ్యులకు 45 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ సెషన్ సైట్ ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ ఇవ్వాలని డిఐఓకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆత్మకూరు మున్సిపాల్టీలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా తక్కువగా నమోదవుతుందని ఆ ఏరియాలో మత పెద్దలతో మాట్లాడి వ్యాక్సినేషన్ వేయించుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చేలా చూడాలన్నారు. సచివాలయం వారీగా ఏ వీధిలో ఎంతమంది మొదటి డోస్ తీసుకున్నారు. ఎంతమంది మొదటి డోస్ తీసుకోలేదు, రెండవ డోసు ఎంత మంది వున్నారు, ఈ వారం ఎంత మంది వేసుకోవాలి, రేపు వారం ఎంత వేసుకోవాలి లాంటి సమాచారాన్ని సేకరించి, ఆ లిస్ట్ ల ప్రకారం ఎవరైతే వ్యాక్సిన్ వేసుకోలేదో ఆ సచివాలయం పరిధిలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు వారిని పిలుచుకోని వచ్చి వ్యాక్సిన్ వేయించాలన్నారు. జిల్లాలో 45 ఏళ్ల పైబడిన వారిలో 53 శాతం వ్యాక్సిన్ వేయించామని, మిగిలిన వారికి కూడా వంద శాతం వ్యాక్సిన్ వేయిం చేలా, సబ్ కలక్టర్, ఆర్డీవోలు, మునిసిప ల్ కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లు, ఎంపీడీఓ లు శ్రద్ధ తీసుకోవాలన్నారు..ప్రతి రోజూ ఈ అంశంపై సమీక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.సబ్ కలక్టర్, ఆర్డీవోలు, మునిసిపల్ కమిషనర్లు తో సమీక్షించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ( గ్రామ సచివాలయం, అభివృద్ధి ) డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నూరల్ ఖామర్, డిఆర్డిఎ పిడి వెంకటేశులు, డిఐఓ విశ్వేశ్వర రెడ్డి, జెడ్పి సీఈఓ వెంకటసుబ్బయ్య, డిఎమ్ హెచ్ ఓ రామగిడ్డయ్య, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు
Post Comment