అమ్మవారికి స్కందమాత అలంకారం, స్వామిఅమ్మవార్లకు శేషవాహనసేవ

 శ్రీశైల దేవస్థానం:దసరా మహోత్సవాలలో భాగంగా అయిదో  రోజు  సోమవారం  ఉదయం అమ్మవారికి ప్రాత:కాల పూజలు, విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, జపానుష్ఠానాలు, పారాయణలు, సూర్య నమస్కారములు, చండీహోమం, పంచాక్షరి, భ్రామరి, బాలా జపానుష్ఠానములు, చండీపారాయణ, చతుర్వేద పారాయణలు, కుమారీ పూజలు జరిపారు.

అదేవిధంగా రుద్రహోమం, రుద్రయాగాంగ జపములు, రుద్ర పారాయణలు జరిపారు.  ఈ సాయంకాలం జపములు, పారాయణలు, నవావరణార్చన, కుంకుమార్చన, చండీ హోమం జరిగాయి.

ఈ రోజు రాత్రి 9.00గంటల నుండి కాళరాత్రిపూజ, అమ్మవారి ఆస్థాన సేవ, సువాసినీపూజలు

జరిపారు.

కుమారీ పూజ:

దసరా మహోత్సవాలలో భాగంగా ప్రతీరోజు కుమారీ పూజలు నిర్వహిస్తున్నారు.

 రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వయస్సు ఉన్న బాలికలను పూలు, పండ్లు, నూతన వస్త్రాలను సమర్పించి పూజిస్తారు. కుమారి పూజ నవరాత్రి ఉత్సవాలలో ఒక ముఖ్యమైన సంప్రదాయం

స్కందమాత అలంకారం:

 నవదుర్గ అలంకారాలలో భాగంగా శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తిని స్కందమాత స్వరూపంలో  అలంకరించారు.

నవదుర్గలలో ఐదవ రూపమైన ఈ దేవి చతుర్భుజాలను కలిగి ఉండి, ఒకచేతిలో స్కందుణ్ణి పట్టుకుని ఉండి, మిగిలిన చేతులలో పద్మాలను, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. ఈమె ఒడిలో బాలుని రూపంలో స్కందుడు (కుమారస్వామి) కూర్చొని ఉంటాడు. స్కంద దేవుని జనని కావడం వలన ఈ దుర్గా స్వరూపం స్కంద మాతగా ప్రసిద్ధి చెందింది. ఈ స్కంద మాతను ఉపాసించడం వల్ల స్కంద దేవుని కూడా ఉపాసన చేసిన ఫలితం లభిస్తుందని చెబుతారు. ఈ దేవిని ఆరాధించడం వలన సకల కోర్కెలు నెరవేరడమే కాకుండా శాంతి సౌఖ్యాలు లభిస్తాయి.

ఈ ఉత్సవాలలో శ్రీస్వామిఅమ్మవార్లకు నిర్వహిస్తున్న వాహనసేవలలో భాగంగా ఈ రోజు శేషవాహనసేవ నిర్వహించారు.

ఈ వాహనసేవలో శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరింపజేసి, శేష వాహనంపై వేంచేబు చేయించి పూజాదికాలు జరిపారు.

*ప్రధాన అంశాలు *

• దసరా మహోత్సవాలలో భాగంగా అయిదో  రోజు  సోమవారం  అమ్మవారికి స్కందమాత అలంకారం,
• స్వామిఅమ్మవార్లకు శేషవాహనసేవ నిర్వహించారు.
• పురవీధుల్లో గ్రామోత్సవం జరిపారు.
• ఉత్సవాల సందర్భంగా  శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు, వాహనసేవలు, అమ్మవారికి నవదుర్గ అలంకరణలు  చేశారు.
• లోకకల్యాణం కోసం  జపాలు, పారాయణలు, రుద్రయాగం, చండీయాగం జరిపారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.