హైదరాబాద్: మణికొండ, పుప్పాలగూడా శ్రీ అనంత పద్మనాభ స్వామి నూతన ఆలయ నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. గతంలో ఇందుకు నిర్వాహకులు , భక్తులు చక్కని ప్రణాళికలు వేసారు. అనేకమంది ఈ ఘన ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఏడు అడుగుల శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి మూలవిరాట్ భారీ విగ్రహ బింబ ప్రతిష్ట మహోత్సవాలు ఘనంగా నిర్వహించిన విషయం విదితమే. శ్రీ స్వామి వారి విగ్రహ బింబ ప్రతిష్ట జరిగిన చోట గర్భాలయ నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలో ఈ నిర్మాణం పూర్తి కానుంది. నిర్వాహకులు,భక్తులు చక్కగా పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణం ప్రధాన స్థపతి శ్రీమాన్ సుందర రాజన్ అయ్యంగార్ గారి నేతృత్వంలో ఇటుక వాడకుండా , పూ ర్తిగా ప్రత్యేక రాతితో నిర్మాణం జరుగుతోంది.
గతంలో
పరమహంస పరివ్రాజకులు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ. చిన జీయర్ స్వామి వారి కరకమలములచే శంకుస్థాపన జరిగిన శ్రీ శ్రీ శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి నూతన ఆలయ నిర్మాణం, మూలవిరట్ విగ్రహ బింబ ప్రతిష్ట కార్యక్రమాలు శ్రీ చాంద్రమానేన శుభకృత్ నామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ చవితి (3.6.2022) నాడు పునర్వసు నక్షత్రంలో ప్రారంభించి జ్యేష్ట శుద్ద షష్ఠి 05.6.2022 నాడు ఆశ్లేష నక్షత్రం లో విగ్రహ బింబ ప్రతిష్ట మహోత్సవాలు పూర్తి చేసారు. భాగవతోత్తములు ,వేద , పాంచరాత్రాగమ పండితులు దిగ్విజయంగా ఈ కార్యక్రమాలు జరిపారు. ఆదివారం ఉదయం 7.00 నుండి 1.00 వరకు. నిత్యారాధన,సేవాకాలం,కెబాలబోగం,బింబశుద్జి,గర్తన్యాసం, గర్తన్యాస హోమం, మహా పూర్ణాహుతి, విగ్రహ( బింబ) స్థాపన . వేద విన్నపం, ఋత్విక్ సన్మానం(పండిత సన్మానం). తీర్ధ ప్రసాద గోష్ఠి నిర్వహించారు.
శుక్రవారం సాయంకాలం. 5.00 నుండి 8.30 ని..వరకు విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచన,రక్షాబంధనం,మృత్సంగ్రహం,అంకురార్పణ,సోమకుంభ స్థాపన, దీక్షాధారణ, జలాది వాసం,పంచగవ్యవాసం,అంకురార్పణ హోమం,ఆదివాస హోమం,వాస్తు హోమం,తీర్ధ ప్రసాద గోష్ఠి జరిగాయి.
శనివారం ఉదయం. 7.30 నుంచి 12.30 వరకు నిత్య ఆరాధన, సేవా కాలం,బాలబోగం, తీర్ధ గోష్ఠి, స్వామి వారికి క్షీరాధివాదం, పంచామృతాధివాసం, కర్మాంగ స్నపానం, ఆదివాస హోమం, వేద విన్నపము, తీర్ధ ప్రసాద గోష్ఠి జరిపారు. సాయంకాలం. 5.00 నుండి 8.30 వరకు విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ, విష్వక్సేనా రాధన,పుణ్యాహవాచన, ఫల, పుష్ప, శయ్య,ధాన్య, ఛాయాదివాసం,ఆదివాస హోమం,తీర్ధ ప్రసాద గోష్ఠి జరిగాయి.
ఈ ఆలయ ఏడు అడుగుల భారీ విగ్రహ బింబ ప్రతిష్ట, యంత్ర ప్రతిష్ట మొదలగు ఇతర ప్రతిష్టా కార్యక్రమాలు శ్రీమాన్ STP భాస్కరా చార్యులు గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ,3-6-2022 నుంచి 5-6-2022 వరకు త్రయాహ్నికంగా ,వైభవంగా,పాంచరాత్ర ఆగమం ప్రకారం ఆలయ కమిటీ వారు నిర్వహించారు.ఆ రోజు నుంచి ఆలయ కమిటీ వారి పర్యవేక్షణలో నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి.
ఆలయ కమిటీ వినతి: ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఆలయ నిర్మాణానికి భక్త జనులు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించవలసిందిగా ఆలయ కమిటీ వారు విజ్ఞప్తి చేసారు.