శ్రీశైల దేవస్థానం: ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపధ్యంలో మంగళవారం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కలిసి వెంకటాపురం -నాగలూటి ప్రాంతాలను పరిశీలించారు. కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ నాగలూటి వద్ద జంగిల్ క్లియరెన్స్ చేయాలని తెలిపారు. నాగలూటి తదితర ప్రదేశాలలో గత సంవత్సరం కంటే అధికంగా పైప్పెండాల్స్ వేయాలన్నారు.నాగలూటి వద్ద వీరభద్రస్వామి ఆలయానికి రంగులు వేయాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. గత సంవత్సరం కంటే కూడా అధికసంఖ్యలో వాటర్ ట్యాంకర్లను పంపాలని నీటిసరఫరా విభాగాన్ని ఆదేశించారు.
ను అందించాలన్నారు.
జనరేటర్లు ఏర్పాటు చేసి తాత్కాలిక విద్యుద్దీకరణ పనులు కూడా చేపట్టాలని ఇంజనీరింగ్ అదికారులను ఆదేశించారు. నాగలూటివద్ద పుష్కరిణిని , భావిని శుభ్రపరిచి భక్తులకు అందుబాటులోకి తెచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ ప్రదేశాలలో తాత్కాలిక శౌచాలయాలు కూడా ఏర్పాటు చేయాలన్నారు.
ఈ పనులన్నీ ఫిబ్రవరి మొదటి వారంలోగా పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఈ ఓ ఆదేశించారు.
ఈ పరిశీలనలో ఎగ్జ్యిక్యూటీవ్ ఇంజనీర్లు పి. మురళీ బాలకృష్ణ, ఎం. నరసింహారెడ్డి, సివిల్ , ఎలక్ట్రికల్ విభాగపు ఇంచార్జి డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు, పి.చంద్రశేఖరశాస్త్రి, పి.వి.సుబ్బారెడ్డి, సంబంధిత సహాయ ఇంజనీరు రంగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.