శ్రీశైల దేవస్థానం:నిజ శ్రావశుద్ధ పాడ్యమి, ఆగస్టు 17వ తేదీ నుండి సెప్టెంబరు 15 వరకు శ్రావణ
మాసోత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించి మంగళవారం కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
పరిపాలనా కార్యాలయం లోని సమావేశ మందిరం లో నిర్వహించిన ఈ సమీక్షలో
సీనియర్ వేదపండితులు, అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, ఇంజనీరింగ్
అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
సమావేశం లో ఆయా విభాగాల వారిగా చేపట్టవలసిన చర్యల గురించి
కార్యనిర్వహణాధికారి దిశానిర్ధేశం చేశారు.
కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న మాట్లాడుతూ శ్రావణ మాసం లో ముఖ్యంగా
శ్రావణ సోమవారాలు, శ్రావణ పౌర్ణమి, వరలక్ష్మీవ్రతం, శుద్ధ, బహుళ ఏకాదశి రోజులు,
శ్రావణ మాసశివరాత్రి, ప్రభుత్వ సెలవురోజులలో అధికసంఖ్యలో భక్తులు ఆలయానికి
సందర్శించే అవకాశం ఉందని, భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని విభాగాల వారు కూడా
ముందస్తుగా ఆయా ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు.
ముఖ్యంగా భక్తులందరికీ కూడా సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకుగాను అవసరమైన
అన్ని చర్యలు చేపట్టాలని ఆలయ విభాగాన్ని ఈ ఓ ఆదేశించారు.క్యూలైన్లలో వేచివుండే భక్తుల సౌకర్యార్థం భక్తులందరికీ కూడా ఎప్పటికప్పుడు మంచినీరు,
అల్పాహారం , బిస్కెట్లను అందజేయాలని అన్నదాన విభాగాన్ని ఆదేశించారు.అదేవిధంగా భక్తులరద్ద్టీకనుగుణంగా అన్నదానమందిరంలో అన్నప్రసాదవితరణను,
సాయంకాలం అల్పాహారాన్ని ఏర్పాటు చేయాలని అన్నదాన విభాగాన్ని ఆదేశించారు.భక్తులరద్దీకనుగుణంగా అవసరమైన మేరకు లడ్డూప్రసాదాలను తయారు చేసి అందుబాటులో
ఉంచాలని ప్రసాదాల విభాగాన్ని ఆదేశించారు. వడ ప్రసాదాన్ని కూడా అందుబాటులో ఉంచాలన్నారు.భక్తులు లడ్డూప్రసాదాల కోసం అధికసమయం వేచివుండకుండా త్వరితంగా
అందజేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
శ్రావణ పర్వదినాలలో గర్భాలయ ఆర్జిత అభిషేకాలు, సామూహిక అభిషేకాలు నిలుపుదల :
శ్రావణమాసంలో రద్దీ కారణంగా శ్రావణ శనివారాలు, శ్రావణ ఆదివారాలు, శ్రావణ
సోమవారాలు, స్వాతంత్ర్య దినోత్సవం, శ్రావణపౌర్ణమి, వరలక్ష్మీ వ్రతం, శ్రీకృష్ణాష్టమి ఆయా పర్వదినాల
రోజులతో పాటు రోజులలో గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలు పూర్తిగా
నిలుపుదల చేస్తారు.
అబిషేకాలు నిలుపుదల చేసిన ఈ నిర్ధిష్ట రోజులలో రోజుకు నాలుగు విడుతలుగా స్వామివార్ల
స్పర్శ దర్శనం కల్పిస్తారు.
మిగతా రోజులలో గర్భాలయ ఆర్జిత అభిషేకాలు, సామూహిక అభిషేకాలు, స్పర్శదర్శనాలు
యథావిధిగా కొనసాగుతాయి.
భక్తులు వివిధ ఆర్జితసేవలను ఆన్‌లైన్ ద్వారానే పొందవలసివుంటుంది.
దేవస్థానం వెబ్‌సైట్ ద్వారా ఆయా టికెట్లను ముందస్తుగా పొందవచ్చు.
టికెట్ల లభ్యతను బట్టి గంట ముందు వరకు కూడా భక్తులు ఈ టికెట్లను పొందవచ్చు.
కాగా శ్రావణమాసంలో కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా భక్తులు అధికసంఖ్యలో క్షేత్రాన్ని
సందర్శిస్తారు.ఈ కారణంగా పర్వదినాలలో ఆర్జిత అభిషేకాలు, నిలుపుదల, స్పర్శదర్శనం ఏర్పాట్లు,
ఆన్‌లైన్‌లో టికెట్లను పొందే విధానం గురించి కర్ణాటక రాష్ట్రములో కూడా తగు ప్రచారం కల్పించడం
జరుగుతోంది.కర్టాటక రాష్ట్ర ప్రజాసంబంధాల విభాగం వారి సహకారంతో ఇప్పటికే ఈ విషయమై ప్రచారం
కల్పించారు.
భక్తులరద్దీ దృష్టిలో ఉంచుకుని పారిశుద్ధ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ కనబర్బాలన్నారు ఈ ఓ.ఎప్పటికప్పుడు చెత్తాచెదారాలను తొలగించేందుకు తగు చర్యలు చేపట్టాలని పారిశుద్ధ్య
విభాగాన్ని ఆదేశించారు.
ఆలయ వేళలు
* ప్రస్తుతం అమలులో ఉన్న విధంగానే ప్రతీరోజు వేకువజామున గం.3.00లకే
ఆలయద్వారాలు తెరచి మంగళవాయిద్యాలు, సుప్రభాతసేవ, ప్రాతకాలపూజలు
జరిపిస్తారు.
* గం.4.30నిలకు ఉభయ దేవాలయాలలో మహామంగళహారతులు ప్రారంభిస్తారు.
* మహామంగళహారతుల ప్రారంభం నుంచే అనగా గం. 4.30లకే భక్తులను దర్శనాలకు
అనుమతిస్తారు. సాయంత్రం గం. 4.00ల వరకు సర్వదర్శనం కొనసాగించబడుతాయి.
* ఆలయశుద్ధి కార్యక్రమం నిర్వహించి మంగళ
వాయిద్యాలు, ప్రదోషకాలపూజలు, సుసాంధ్యం తరువాత గం. 5.30ల నుంచి
మహామంగళహారతులు ప్రారంభించబడుతాయి.
అఖండ శివనామ భజనలు :
లోక కల్యాణం కోసం శ్రావణమాసమంతా శ్రావణశుద్ధ పాఢ్యమి (17.08.2023) నుండి
బాధ్రపదశుద్ధ పాడ్యమి (15.09.2029) వరకు అఖండ చతుస్సప్తహా శివభజనలు
జరిపించబడుతాయి.
* ఈ అఖండ భజనలలో మొత్తం 7 భజన బృందాలకు అవకాశం కల్పించారు.
* ఒక్కొక్క భజన బృందంలో 45 మంది పాల్గొనే అవకాశం ఉంది.
సామూహిక వరలక్ష్మీ వ్రతాలు:
* శ్రావణమాసంలో భక్తుల సౌకర్యార్థమై రెండు పర్యాయాలు ఉచిత సామూహిక వరలక్ష్మీ
వ్రతములు జరిపించబడుతాయి.
* శ్రావణ రెండవ శుక్రవారం రోజున 25.08.2023న 750 మందికి,
తెల్లరేషన్‌కార్డు కలిగిన వారు 250 మంది ముత్తెదువులకు ఈ వ్రతం జరిపించబడుతుంది.
* అదేవిధంగా శ్రావణ నాలగవ శుక్రవారం రోజున 08.09.2023 న ప్రత్యేకంగా 500
మంది చెంచు ముత్తైదువులకు, 500 మంది ఇతర భక్తులకు ఈ సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
జరిపించబడుతాయి.
పరోక్షసేవగా వరలక్ష్మీ వ్రతం:
భక్తుల సౌకర్యార్ధమై దేవస్థానం పరోక్ష ఆర్జితసేవగా వరలక్షీ వ్రతాన్ని చేసుకునే అవకాశాన్ని
దేవస్థానం కల్పిస్తుంది.
ఈ పరోక్షసేవకు రూ.1,116-00లను రుసుముగా నిర్ణయించారు.
పరోక్షసేవగా జరిపించుకున్న భక్తులకు కుంకుమ, విభూతి, కలకండ, అక్షితలతో పాటు
అమ్మవారి ప్రసాదంగా ఒక రవిక వస్త్రాన్ని పోస్టు ద్వారా పంపడం జరుగుతుంది.
సాధారణ రోజులలో స్పర్శదర్శనం :
నిర్ధేషించబడిన పర్వదినాలలో మినహా తక్కిన రోజులలో ప్రస్తుతం అమలులో ఉన్న విధంగానే
శ్రావణమాసంలో కూడా మంగళ, బుధ,గురు, శుక్రవారాలలో భక్తులకు మధ్యాహ్నవేళలో
శ్రీస్వామివారి ఉచిత స్పర్శదర్శనం కల్పించబడుతుంది.
అయితే స్పర్శదర్శనం పొందగోరు భక్తులు మధ్యాహ్నం గం.1.30లలోగా క్యూలైన్ ప్రవేశద్వారం
వద్ద రిపోర్టు చేయవలసివుంటుంది.
మధ్యాహ్నం గం. 1.30ల నుంచి మధ్యాహ్నం గం. 2.00ల లోపల క్యూలైన్‌లో ప్రవేశించిన
భక్తులకు మాత్రమే స్పర్శదర్శనం కల్పిస్తారు.