
శ్రీశైల దేవస్థానం:ఈ నెల 17 నుండి సెప్టెంబర్ 15 వరకు శ్రావణమాసోత్సవాలు
జరుగనున్న కారణంగా పలు అభివృద్ధి చర్యలు తీసుకుంటున్నారు.
భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని శ్రావణ మాసోత్సవాల సందర్భంగా వివిధ విస్తృత
ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇందులో భాగంగా బుధవారం కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న లడ్డు ప్రసాదాల విక్రయ
కేంద్రాలు, అన్నప్రసాద వితరణ, పార్కింగ్ ప్రదేశాలు, పలుచోట్ల శివగంగ జలప్రసాద
ప్లాంట్లను పరిశీలించారు.
లడ్డు ప్రసాద విక్రయ కేంద్రాల పరిశీలన సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ
రాబోయే శ్రావణ మాసోత్సవాలలో వచ్చే భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన మేరకు
లడ్డుప్రసాదాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. తగినంతగా పులిహోర , వడ
ప్రసాదాన్ని కూడా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. భక్తులు అధిక సమయం క్యూలైన్లలో
వేచివుండకుండా త్వరితంగా ప్రసాదాలు అందించేందుకు చర్యలు చేపట్టాలని ప్రసాద విక్రయకేంద్రపు
పర్యవేక్షకులు మధుసూధన్‌రెడ్డిని ఆదేశించారు. ముఖ్యంగా భక్తులు ఇబ్బందులు పడకుండా
ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. శని, ఆది, సోమవారాలలో భక్తులరద్ధీ ఎక్కువగా
ఉంటుందని, ఈ రద్ధీరోజులలో మరిన్ని చర్యలు చేపట్టాలన్నారు.
ప్రసాదాల విక్రయ కేంద్రం వద్ద మరిన్ని సూచిక బోర్జులను ఏర్పాటు చేయాలని శ్రీశైలప్రభ
సంపాదకుడిని ఆదేశించారు.
తరువాత అన్నప్రసాద వితరణను పరిశీలించారు ఈ ఓ. శ్రావణ మాసంలో వచ్చే భక్తుల రద్ధీకనుగుణంగా
అన్నప్రసాద వితరణను చేయాలని పర్యవేక్షకులను ఆదేశించారు. సాధారణరోజులలో
చేసే కంటే కూడా శ్రావణమాసంలో అదనంగా కూడా అన్నప్రసాద వితరణ జరగాలన్నారు. అన్నప్రసాద
వితరణలో వండిన ప్రతి వంటకం కూడా ప్రతీ భక్తుడికి అందేవిధంగా నిరంతరం పర్యవేక్షిస్తుండాలని
అధికారులను ఆదేశించారు. అన్నప్రసాదాలను స్వీకరించేందుకు వచ్చిన భక్తులు అధిక సమయం వేచి ఉండకుండా
నిరంతరం పర్యవేక్షిస్తుండాలన్నారు. ఎప్పటికప్పుడు కూరగాయాలు తాజాగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా వంటకాలన్నీ రుచికరంగా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటుండాలని వంట స్వాములను ఆదేశించారు. ఈ
సందర్భంగా ఈ రోజు వండిన వంటకాలను స్వయంగా పరిశీలించారు. తరువాత అన్నప్రసాదాన్ని
స్వీకరిస్తున్న పలువురు భక్తులతో ముఖాముఖిగా సంభాషించారు. భక్తులందరు కూడా అన్నప్రసాదాల పట్ల
సంతృప్తి వ్యక్తం చేశారు.
తరువాత శివగంగా జలప్రసాద ప్లాంట్లను ఈ ఓ పరిశీలించారు. జగద్దురుమఠం, దేవస్థానం వైద్యశాల,
జిల్లా పరిషత్ అతిథిగృహం, టూరిస్ట్ బస్టాండ్, తదితరచోట్ల ఏర్పాటు చేసిన
వాటర్ ప్లాంట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ ఓ మాట్లాడుతూ నీటిసరఫరా ఇంజనీరింగ్
అధికారులు ఆయా ప్లాంట్లను ప్రతీరోజు కూడా శుభ్రపరిచేవిధంగా పర్యవేక్షణ చేస్తుండాలన్నారు.
భక్తులందరికీ శుద్ధజలం అందేవిధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. శుద్దజల ప్లాంట్లలో
ఎలక్ట్రికల్ వైరింగ్, అవసరమైన మరమ్మతులు వెంటనే చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను
ఆదేశించారు. ఆయా ప్లాంట్ల వద్ద నీరు వృథా కాకుండా పైపులైనట్లకు అవసరమైనచోట్ల మరమ్మతులు
చేయాలన్నారు. మంచినీటి ప్లాంట్ల వద్ద ఎటువంటి చెత్తా చెదారం లేకుండా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య
చర్యలు చేపట్టాలని పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు.
ఈ పరిశీలనలో భాగంగా దేవస్థానం వైద్యశాల, టూరిస్ట్ బస్టాండు, ఘంటామఠం తదితర
ప్రాంతాలలో పార్కింగ్ ప్రదేశాలను ఈ ఓ పరిశీలించారు. పారింగ్ ప్రదేశాలలోనూ , క్షేత్రపరిధిలో
అవసరమైనచోట్ల పిచ్చిమొక్కలను తొలగించాలని ఆదేశించారు. పార్కింగ్
ప్రదేశాలు, పార్కింగ్ ప్రదేశాల పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉండేవిధంగా నిరంతరం
పర్యవేక్షించాలని పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు.
ఈ పరిశీలనలో భాగంగానే క్షేత్రపరిధిలో గల పలు శౌచాలయాలను కూడా
కార్యనిర్వహణాధికారి పరిశీలించారు. అన్ని శౌచాలయాలు కూడా ఎప్పటికప్పుడు
శుభ్రపరిచేందుకు అన్ని చర్యలు చేపట్టాలని పారిశుద్ద్యవిభాగాన్ని ఆదేశించారు.
ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు వి. రామకృష్ణ, అన్నప్రసాద వితరణ విభాగ పర్యవేక్షకులు
సి. మధుసూధన్‌రెడ్డి, రెవెన్యూ విభాగ పర్యవేక్షకులు కె. శివప్రసాద్, పారిశుద్ధ్య విభాగపు పర్యవేక్షకులు కె.
అయ్యన్న, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజసీరు ( ఐ/సి) చంద్రశేఖరశాస్త్రి, సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్లు, ఎడిటర్ డా.సి.అనిల్ కుమార్ పాల్గొన్నారు.