శ్రీశైలదేవస్థానం: కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు ముక్కోటి ఏకాదశి ఉత్సవం , సాయంకాలం జరుగునున్న పుష్పార్చన ఏర్పాట్లను సమీక్షించారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ లోక కల్యాణం కోసం జరిపే ఉత్సవంలోను , పుష్పార్చనలోనూ ఆయా కైంకర్యాలన్నీ శ్రీస్వామిఅమ్మవార్లకు పరిపూర్ణంగా జరిపించాలని వైదిక సిబ్బందికి సూచించారు.
ముఖ్యంగా ఆయా పూజాదికాలకు సంబంధించి సమయపాలన పాటించాలన్నారు.
ఉదయం జరుగనున్న శ్రీస్వామిఅమ్మవార్ల గ్రామోత్సవానికి జరిపే ఏర్పాట్లు ఎటువంటి లోటు లేకుండా ఉండాలని ఆలయ, ఇంజనీరింగ్, భద్రతా విభాగాలను ఆదేశించారు.
భక్తులు క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని క్యూకాంప్లెక్సు విభాగాన్ని ఆదేశించారు. ముఖ్యంగా సమయానుసారంగా క్యూలైన్లలో మంచినీరు, ఆహారాన్ని అందించాలన్నారు.
ఆలయం ,క్యూకాంప్లెక్సు విభాగాలు పరస్పర సమన్వయముతో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించాలన్నారు.
అదేవిధంగా పుష్పార్చనకు సంబంధించి అక్కమహాదేవి అలంకార మండపంలో తగువిధంగా వేదిక ఏర్పాట్లు ఉండాలన్నారు.
పుష్పార్చనను శ్రీశైలటీవి , దేవస్థానం యూ ట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలను చేయాలని శ్రీశైలటీవి విభాగాన్ని ఆదేశించారు.
పుష్పార్చనను భక్తులు వీక్షించేందుకు అక్కమహాదేవి అలంకార మండపంలో ఎల్.ఈ.డి స్క్రీనును ఏర్పాటు చేయాలన్నారు.
ఈ సమావేశంలో వైదిక కమిటీ, ఇంజనీరింగ్, ఆలయం, భద్రత, క్యూకాంప్లెక్సు, వసతి విభాగాధికారులు పాల్గొన్నారు.