శ్రీశైల దేవస్థానం: ముఖ్య కార్యక్రమాలకు ముందునుంచే ఏర్పాట్లు అవసరమని ఈ ఓ ఆదేశించారు. కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు గురువారం పలు అంశాలకు సంబంధించి సమీక్షా
సమావేశాన్ని నిర్వహించారు. సమీక్షలో ఉభయదేవాలయాల ప్రధానార్చకులు, సీనియర్ వేదపండితులు, అధ్యాపక, అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
కార్తిక మాస చివరి రోజులో భక్తులరద్దీకనుగుణంగా చేయవలసిన ఏర్పాట్లు, డిసెంబరు 23వ తేదీన
ముక్కొటీ ఏకాదశి పర్వదినం రోజున చేయవలసిన ఏర్పాట్లు, డిసెంబరు 27 శివముక్కోటి పర్వదినాన
చేయవలసిన ఏర్పాట్లు, వచ్చే జనవరి మాసంలో జరగబోయే సంక్రాంతి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు మొదలైన
అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ ఈ నెల 12 తో కార్తీక మాసం ముగుస్తున్నదని, కార్తీక మాసంలోని ఈ చివరి రోజులలో ముఖ్యంగా ఆది, సోమవారాలలో అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి సందర్శించే అవకాశం ఉందని, భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని విభాగాల వారు కూడా ఆయా ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ కనబర్బాలన్నారు.ముఖ్యంగా భక్తులందరికీ కూడా సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకుగాను అవసరమైన అన్ని
చర్యలు చేపట్టాలని ఆలయ విభాగాన్ని ఆదేశించారు.క్యూలైన్లలో వేచివుండే భక్తుల సౌకర్యార్థం భక్తులందరికీ కూడా _ ఎప్పటికప్పుడు మంచినీరు,అల్పాహారం , బిస్కెట్లను అందజేయాలని అన్నదాన విభాగాన్ని ఆదేశించారు.
భక్తులరద్దీకనుగుణంగా అన్నదాన మందిరంలో అన్నప్రసాద వితరణను, సాయంకాలం
అల్పాహారాన్ని ఏర్పాటు చేయాలని అన్నదాన విభాగాన్ని ఈ ఓ ఆదేశించారు.భక్తులరద్దీకనుగుణంగా అవసరమైన మేరకు లడ్డూప్రసాదాలను తయారు చేసి అందుబాటులో ఉంచాలని ప్రసాదాల విభాగాన్ని ఆదేశించారు.భక్తులు లడ్డూప్రసాదాల కోసం అధిక సమయం వేచివుండకుండా త్వరితంగా లడ్డూ ప్రసాదాలను
అందజేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. పాతాళగంగ వద్ద భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు తగు ఏర్పాట్లు ఉండాలన్నారు.ముఖ్యంగా పాతాళగంగలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య చర్యలు వుండాలని అన్నారు.
ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు స్థానిక పోలీస్ అధికారులతో తగు సమన్వయ చర్యలు చేపట్టాలని భద్రతావిభాగపు పర్యవేక్షకులను ఈ ఓ ఆదేశించారు.ముఖ్యంగా భక్తులు కార్తీక దీపాలు వెలిగించుకునేందుకు గంగాధర మండపం వద్ద. ఆలయ ఉత్తరమాడవీధి వద్ద తగు ఏర్పాట్లు ఉండాలన్నారు.
డిసెంబరు 23న ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగాను, 27న శివముక్కోటి
పర్వదిన సందర్భంగాను జరపాల్సిన ఆయా కైంకర్యాలన్నీ సంప్రదాయబద్దంగా జరిపించాలని వైదిక మండలికి ఈ ఓ
సూచించారు. ఈ రెండు పర్వదినాలలో జరిపే శ్రీస్వామిఅమ్మవార్ల గ్రామోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ
చేయాలని ఆలయ విభాగాన్ని ఆదేశించారు.
వచ్చే జనవరి మాసంలో 12 నుండి 18వ తేదీ వరకు 7 రోజులపాటు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయాలని ,ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని అన్ని విభాగాల అధికారులను ఈ ఓ ఆదేశించారు. బ్రహ్మోత్సవాలలో
జరిగే వైదిక కార్యక్రమాలు, వాహనసేవలు, గ్రామోత్సవాల నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
జనవరి 14 భోగి పండుగరోజున సంప్రదాయాన్ని అనుసరించి భోగి మంటల కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.
ఖోగి రోజున సామూహికంగా చిన్నపిల్లలకు భోగిపండ్లు వేసే కార్యక్రమాన్ని కూడా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొనే విదంగా ఈ సామూహిక
బోగిపండ్ల కార్యక్రమాన్ని గురించి ముందస్తుగానే తగు ప్రచారం కల్పించాలన్నారు.జనవరి15, సంక్రాంతిరోజున గతంలో వలనే మహిళలకు ముగ్గులపోటీలు నిర్వహించాలన్నారు.దక్షిణమాడవీధిలో ఈ ముగ్గుల పోటీలకు తగు ఏర్పాట్లు చేయాలని ఇంజనీరింగ్. ఆలయం. ప్రజాసంబంధాల విభాగాలను ఆదేశించారు.
సంక్రాంతి పర్వదినం రోజు జరిగే బ్రహ్మోత్సవ కల్యాణానికి చెంచు గిరిజన భక్తులను ప్రత్యేకంగా
ఆహ్వానించాలన్నారు. ఈ విషయమై స్థానిక ఐ.టి.డి.ఏ అధికారులతో తగు సమన్వయం చేపట్టాలని ఆలయం
మరియు ప్రజాసంబంధాల విభాగాలను ఆదేశించారు.సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో 17వ తేదీన వేదశ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆలయ విభాగాన్ని ఆదేశించారు. ఈ వేద శ్రవణ కార్యక్రమానికి పలు ప్రాంతాల నుంచి వేదపండితులను ఆహ్వానించాలన్నారు.
ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు:
పర్యావరణ పరిరక్షణలో భాగంగా క్షేత్రపరిధిలో ష్లాస్టిక్ నిషేధానికి చర్యలు చేపట్టాలని సంబంధిత
చిభాగాల వారిని ఈ ఓ ఆదేశించారు. ఈ విషయమై స్థానికులలోనూ, భక్తులలోనూ తగు అవగాహన కల్పించేందుకు
ప్రచార కార్యక్రమాన్ని బాగా చేపట్టాలన్నారు.అదేవిధంగా స్థానికులు, స్థానికంగా ఉండే అన్ని సత్రాల వారు, క్షేత్రాన్ని దర్శించే భక్తుల సహకారంతోనే ప్లాస్టిక్ నిషేధం వీలవుతుందని, ఈ విషయమై తగు అవగాహన కల్పించడం ద్వారా అందరి సహకారం పాందవచ్చన్నారు.
జనవరి 1 నుంచి క్షేత్ర పరిధిలో ప్లాస్టిక్ నిషేధాన్ని ఖచ్చితంగా అమలు చేసేందుకు తగు చర్యలు
చేపట్టాలని సంబంధిత బిభాగాలను ఈ ఓ ఆదేశించారు.