క్యూలైన్లలో ఎలాంటి తొక్కిసలాటలు జరగకుండా నిరంతరం తగు జాగ్రత్తలు చేపడుతుండాలి-ఈ ఓ

 శ్రీశైల దేవస్థానం:పరిపాలనాంశాల పరిశీలనలో భాగంగా బుధవారం  కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజ క్యూకాంప్లెక్సును సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఈ ఓ  మాట్లాడుతూ వారాంతపు రోజులలో భక్తులరద్దీ అనుసరించి అవసరం మేరకు క్యూకాంప్లెక్సులోని డి- బ్లాకును కూడా వినియోగించుకోవాలని క్యూకాంప్లెక్సు అధికారులను సూచించారు. ఇందుకు అనుగుణంగా దర్శనానికి వేచివున్న భక్తులు క్యూకాంప్లెక్సులో కూర్చునేందుకు వీలుగా వెంటనే తగు ఏర్పాట్లు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సాధారణంగా క్యూకాంప్లెక్సులోని డి-బ్లాకు మహాశివరాత్రిబ్రహ్మోత్సవాలు, ఉగాది మహోత్సవాలు, కార్తీక మాసోత్సవాలలో వినియోగించడం జరుగుతోంది. ఈ డి – బ్లాకులో మొత్తం నాలుగు కంపార్టుమెంట్లు ఏర్పాట్లు చేశారు. క్యూ కాంప్లెక్సులో మరిన్ని శౌచాలయాల ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

 క్యూకాంప్లెక్సుకు ఎదురుగా భక్తుల ప్రవేశమార్గానికి ఎడమవైపున గల గదులలో (గతంలో కొబ్బరికాయలను విక్రయించిన గదులు) సామాన్లు భద్రపరచుకునే గదులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.  ఈ సముదాయంలోని ఒక గదిలో బేబీ ఫీడింగ్రూమును ఏర్పాటు చేయాలని కూడా ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

 భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కూడా అధికారులను ఈ ఓ  సూచించారు.క్యూలైన్లలో ఎలాంటి తొక్కిసలాటలు జరగకుండా నిరంతరం తగు జాగ్రత్తలు చేపడుతుండాలన్నారు. ముఖ్యంగా క్యూకాంప్లెక్సులో దర్శనానికి వేచివుండే భక్తులకు మంచినీరు, అల్పహారం అందజేస్తుండాలన్నారు.

ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు వి. రామకృష్ణ, క్యూకాంప్లెక్సు విభాగం సహాయ కార్యనిర్వహణాధికారి ఐ.ఎన్.వి.మోహన్, పర్యవేక్షకులు టి. హిమబిందు, సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్లు, ఎడిటర్ డా. సి. అనిల్ కుమార్  పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed