×

అదనంగా చలువ పందిళ్ళు,అధిక సంఖ్యలో మంచినీటి ట్యాంకుల ఏర్పాటుకు ఈ ఓ ఆదేశాలు

అదనంగా చలువ పందిళ్ళు,అధిక సంఖ్యలో మంచినీటి ట్యాంకుల ఏర్పాటుకు ఈ ఓ ఆదేశాలు

 శ్రీశైల దేవస్థానం:మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులు పాదయాత్రతో వెంకటాపురం, నాగలూటి, దామర్లకుంట, పెద్దచెరువు, మఠంబావి, భీముని కొలను, కైలాసద్వారం మీదుగా శ్రీశైలక్షేత్రాన్ని చేరుకుంటారు కనుక , కాలిబాట మార్గములో అటవీశాఖ, వైద్యఆరోగ్యశాఖ సహకారం తో భక్తులకు వివిధ సౌకర్యాలు కల్పిస్తున్నారు.

పాదయాత్రతో వచ్చే భక్తుల సౌకర్యాల పరిశీలనలో భాగంగా శనివారం  కార్యనిర్వహణాధికారి లవన్న  సంబంధిత అధికారులతో కలిసి కైలాసద్వారం, భీముని కొలను మెట్ల ప్రారంభ ప్రదేశం పెచ్చెర్వు, నాగలూటి ప్రాంతాలలో క్షేత్రపర్యటన జరిపారు.ఈ సందర్భంగా ఈ ఓ  మాట్లాడుతూ కైలాసద్వారం వద్ద భక్తులు సేద తీరేందుకు వీలుగా  గతములో మాదిరిగానే విశాలమైన  చలువ పందిర్లను (తాత్కాలిక షెడ్డు) వేయడంతో పాటు మంచినీటి వసతి, తాత్కాలిక విద్యుద్ధీకరణ మొదలైన ఏర్పాట్లను చేయాలన్నారు.

కైలాసద్వారం వద్ద,  భీమునికొలను మెట్ల మార్గంలో నిరంతరం మంచినీటి సరఫరా జరుగుతుండాలని ఇంజనీరింగ్ అధికారులను ఈ ఓ  ఆదేశించారు.కైలాసద్వారం వద్ద గల 20వేల లీటర్ల సామర్థ్యపు శాశ్వత మంచినీటిట్యాంకు (ఆర్.సి.సి ట్యాంకు)నకు నిరంతరం మంచినీటిని సరఫరా జరుగుతుండాలన్నారు..అదేవిధంగా కైలాసద్వారం వద్ద గతంలో వలె 5వేల లీటర్ల సామర్థ్యం గల మరో 6 సింటెక్స్ ట్యాంకులు ఏర్పాటు చేయాలన్నారు.ముఖ్యంగా కైలాసద్వారం నుండి భీముని కొలను మార్గములో 1000 లీటర్ల సామర్థ్యం గల ట్యాంకులను కనీసం 8 చోట్ల ఏర్పాటు చేయాలని ఆదేశించారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సమన్వయంతో కైలాసద్వారం వద్ద ఉచిత వైద్యశిబిరం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. కాలిబాటతో వచ్చే భక్తులు ప్రధానంగా కాలిబొబ్బలు, ఒళ్లునొప్పులు మొదలైన ఇబ్బందులతో బాధపడుతుంటారని, ఈ సమస్యలకు సంబంధించిన మాత్రలు, పూతమందులు (ఆయింట్మెంట్) మొదలైనవి అందుబాటులో వుంచాలన్నారు.

పెద్దచెరువు – నాగలూటి పరిశీలన:

కైలాసద్వారం పరిశీలించిన తరువాత కార్యనిర్వహణాధికారి పెద్ద చెరువు

ప్రాంతాలను పరిశీలించారు.ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి కాలిబాటమార్గములో మంచినీటి సదుపాయం, నాగలూటి వద్ద అన్నదానం చేసే భక్తులకు అందించనున్న సహాయ సహకారాలు, కాలిబాట మార్గములో మార్గసూచికల ఏర్పాటు, వైద్యశిబిరాల ఏర్పాటు మొదలైన అంశాల గురించి తగు ఆదేశాలు జారీ చేశారు.అటవీశాఖ వారి సహకారంతో నాగలూటి వద్ద భక్తులు సేద తీరేందుకు వీలుగా జంగిల్ క్లియరెన్స్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు.

 నాగలూటి వద్ద గల కోనేర్లకు మరమ్మతులు చేసి వాటిని శుభ్రపర్చాలన్నారు. పెద్ద చెరువు వద్ద గత సంవత్సరము కంటే కూడా అదనంగా చలువపందిళ్ళు వేయాలని సూచించారు.ఉత్సవాల సమయములో నాగలూటి, పెద్ద చెరువు ప్రాంతాలకు గత సంవత్సరం కంటే కూడా అధికసంఖ్యలో మంచినీటి ట్యాంకులను పంపాలని ఆదేశించారు.

పాదయాత్ర ద్వారా వచ్చే భక్తులకు గత సంవత్సరము వలనే పెద్ద చెరువు వద్ద కంకణాలను ( రిస్ట్బ్యండ్లను ) ధరింపజేసేందుకు తగు ఏర్పాట్లు చేయాలన్నారు.ఈ పాదయాత్ర భక్తులు దర్శనానికి అధిక సమయం వేచివుండకుండా వుండేవిధంగా దర్శన ఏర్పాట్లు చేయాలన్నారు.

ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు వి. రామకృష్ణ, అసిస్టెంట్ ఇంజనీర్లు రాజేశ్వరరావు, రంగప్రసాద్  ఎడిటర్ డా.సి.అనిల్ కుమార్  తదితరులు పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed