×

50 సంవత్సరాలలో భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఆయా ఏర్పాట్లుపై దృష్టి సారించాలి-ఈ ఓ

50 సంవత్సరాలలో భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఆయా ఏర్పాట్లుపై దృష్టి సారించాలి-ఈ ఓ

 శ్రీశైల దేవస్థానం:బృహత్తర ప్రణాళిక పరిశీలనలో భాగంగా బుధవారం  కార్యనిర్వహణాధికారి  డి. పెద్దిరాజు సంబంధిత ఇంజనీరింగ్ విభాగం, బృహత్తర ప్రణాళిక నిపుణులతో కలిసి ఆయా ప్రదేశాలను పరిశీలించారు.ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి  డి.పెద్దిరాజు మాట్లాడుతూ రాబోయే 50 సంవత్సరాలలో భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఆయా ఏర్పాట్లు పట్ల దృష్టి సారించవలసిన అవసరం ఉందన్నారు.

ఈ పరిశీలనలో భాగంగా వలయ రహదారి, పార్కింగు ప్రదేశాలు, రహదారి డివైడర్లు, త్రాగునీటి ప్లాంట్లు, పాత పుష్కరిణి, పలు ఉద్యానవనాలు, పాతాళగంగ వద్ద ఏర్పాట్లు, నూతన క్యూలైన్ల ఏర్పాటు, లడ్డు ప్రసాదాల తయారీ కేంద్రంలో మరిన్ని ఏర్పాట్లు, నీటిసరఫరా, ఫిల్టరుబెడ్లు, ఆలయ మాడవీధుల సమీపంలో కళావేదిక నిర్మాణం, శివసేవకుల వసతి విభాగం, మొదలైన ఏర్పాట్లకు సంబంధించి నిపుణులు కూలంకషంగా చర్చించారు.అదేవిధంగా ఆలయ ప్రాంగణం, శ్రీస్వామివారి పాకశాల, శ్రీ అమ్మవారి పాకశాల, లడ్డుప్రసాదాల తయారీ కేంద్రం, అన్నప్రసాదవితరణ భవనం మొదలైనచోట్ల మరింతగా ఏర్పాటు చేయవలసిన అగ్నిమాపక యంత్రాల ఏర్పాటు మొదలైన అంశాల గురించి కూడా చర్చించారు.

 క్షేత్రపరిధిలో  విద్యుత్ ట్రాన్సఫార్మర్ల చుట్టూ దృఢమైన కంచె ఏర్పాటు చేయాలన్నారు ఈ ఓ.అదేవిధంగా పెద్దసత్రం ముందుభాగం మొదలైనచోట్ల గల ఎగుడు దిగుడు గల ఫ్లోరింగుకు తగు మరమ్మతులు చేసి చదునైన ఫ్లోరింగును ఏర్పాటు చేయాలన్నారు.

ఈ పరిశీలనలో మాస్టర్ ప్లాన్ నిపుణులు కె.ఎస్.ఎస్. వి.వి. ప్రసాద్, రాజేంద్ర, ఐ.ఐ.టి ప్రొఫెసర్ డా. శశిధర్, దేవస్థానం ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు రామకృష్ణ, మురళీధరరెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు చంద్రశేఖరశాస్త్రి ( ఐ / సి), పలువురు సహాయ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed