×

దుకాణాదారులు, హోటల్ నిర్వాహకులు శుచీ శుభ్రతలను పాటించాలి-ఈ ఓ

దుకాణాదారులు, హోటల్ నిర్వాహకులు శుచీ శుభ్రతలను పాటించాలి-ఈ ఓ

 శ్రీశైల దేవస్థానం:ఏప్రియల్ 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు జరుగనున్న  సందర్భంగా  శుక్రవారం   సాయంత్రం కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు  స్థానిక దుకాణాదారులతో సమావేశాన్ని నిర్వహించారు.

కార్యాలయ భవనంలో జరిగిన ఈ సమావేశంలో స్థానిక పోలీస్ సర్కిల్ ఇన్ స్పెక్టర్  జి. ప్రసాదరావు, సబ్ ఇన్ స్పెక్టర్  జి. లక్ష్మణ రావు పాల్గొన్నారు. దేవస్థాన రెవెన్యూ విభాగ అధికారులు సిబ్బంది కూడా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి  డి. పెద్దిరాజు  మాట్లాడుతూ ఉగాది మహోత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు క్షేత్రాన్ని సందర్శిస్తారన్నారు. ఉత్సవాలు 6 వ తేదీన ప్రారంభం అవుతున్నప్పటికీ అంతకంటే ఐదారు రోజులు ముందుగానే అనగా ఏప్రిల్ 1వ తేదీ నుంచే భక్తుల రద్దీ ఉండే అవకాశం ఉందన్నారు.  దుకాణాదారులు అందరు కూడా భక్తులతో మర్యాదగా మెలగాలన్నారు. అందరు కూడా సంయమనం పాటించాలన్నారు. దుకాణాదారులు అందరూ కూడా ధరల పట్టికలను ప్రదర్శింపజేయాలన్నారు. అందరు కూడా నిర్దిష్ట ధరలకే అనగా ఎం.ఆర్.పి. ధరలకే ఆయా వస్తువులను విక్రయించాలన్నారు.దుకాణాదారులు, హోటల్ నిర్వాహకులు శుచీ శుభ్రతలను పాటించాలన్నారు. ఆహార పదార్థాల పై, తినుబండారాల పైన తప్పనిసరిగా మూతలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.

దుకాణాదారులు చెత్త కుండీలను ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు చెత్తాచెదారాలను చెత్త బుట్టలో వేస్తుండాలన్నారు. దేవస్థాన పారిశుద్ధ్య సిబ్బంది నిర్ధిష్ట వేళలలో చెత్తా చెదారాలను యార్డ్ కు తరలిస్తారన్నారు.

 సర్కిల్ ఇన్ స్పెక్టర్ ప్రసాదరావు మాట్లాడుతూ దుకాణాదారులు వారి దుకాణంలో పనిచేసే పనివారికి కూడా భక్తులతో మెలగవలసిన తీరుపై తగు అవగాహనను కల్పించాలన్నారు. దుకాణాదారులు ఏర్పాటు చేసుకునే తాత్కాలిక పనివారి ఆధార కార్డులను సేకరించి పరిశీలించుకోవాలన్నారు.అదే విధంగా దుకాణాదారులు అందరు కూడా సి.సి. కెమెరాలను ఏర్పటు చేసుకోవాలని సూచించారు.సమావేశంలో రెవెన్యూ విభాగం సహాయ కార్యనిర్వహణాధికారి బి. మల్లికార్జున రెడ్డి, రెవెన్యూ ఇన్ స్పెక్టర్లు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed