
శ్రీశైల దేవస్థానం:ఏప్రియల్ 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్నారు.
ఐదు రోజులపాటు ఈ మహోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై కార్యాలయంలోని
సమావేశ భవనం లో కార్యనిర్వహణాధికారి మంగళవారం స్థానిక వివిధ శాఖల
అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో స్థానిక తహశీల్దార్ గుర్రప్పు, సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్‌కుమార్, సబ్ఇన్స్పెక్టర్లు
లక్ష్మణ్‌రావు, గంగయ్యయాదవ్, అగ్నిమాపక స్టేషన్ ఆఫీసర్ అయూబ్‌ఖాన్, స్థానిక మండల ప్రాథమిక
ఆరోగ్య కేంద్రం వైద్యురాలు శ్రీవాణి, దేవస్థానం వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న అపోలో వైద్యులు డా. శ్రవణ్,
తదితరులు పాల్గొన్నారు.అదేవిధంగా దేవస్థానం అన్ని విభాగాల యూనిట్ అధికారులు, ఉభయదేవాలయాల ప్రధానార్చకులు, పర్యవేక్షకులు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
సమావేశంలో కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ ఉగాది ఉత్సవాలకు కర్టాటక రాష్ట్రంలోని
పలు ప్రాంతాల నుండే కాకుండా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుండి ముఖ్యంగా షోలాపూర్, సాంగ్లీ
తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని
కోణాల నుండి తగు జాగ్రత్తలు తీసుకుంటూ, ఆయా ఏర్పాట్లన్నీ పూర్తి చేయవలసినదిగా సంబంధిత
అధికారులను ఆదేశించారు.ముఖ్యంగా సిబ్బంది అందరు కూడా క్షేత్రానికి విచ్చేసే భక్తులందరితో మర్యాదగా మెలగాలని, ప్రతీ భక్తుడిని ఒక అతిథిగా భావించాలని సూచించారు.
ఉగాది ఉత్సవాలు ఏప్రియల్ 6 తేదీన ప్రారంభమవుతున్నప్పటికీ వారం రోజులు ముందుగానే భక్తులు
క్షేత్రానికి చేరుకునే అవకాశం ఉందని చెబుతూ, ఈ నెల 29వ తేదీకంతా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి
చేయాలని సంబంధిత విభాగాలను ఆదేశించారు.ఉగాది ఏర్పాట్లపై ఈ నెల 13వ తేదీన జరిగిన సన్నాహక సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అనుసరించి అన్నివిభాగాలు కూడా తగు కార్యాచరణ ప్రణాళికలతో ఆయా ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు.
ముఖ్యంగా ఉత్సవాలలో శ్రీస్వామిఅమ్మవార్లకు జరిగే ఆయా కైంకర్యాలన్నీ ఎలాంటి లోపం లేకుండా
పరిపూర్ణంగా జరగాలని వైదిక సిబ్బందికి ఈ ఓ సూచించారు. అదేవిధంగా ఉత్సవ పూజాదికాలు అన్నీ కూడా
నిర్దేశించిన సమాయానికంతా ప్రారంభించాలని వైదిక సిబ్బందికి సూచించారు.
ఉత్సవాలకు కాలిబాట మార్గములో అనగా వెంకటాపురం, నాగలూటి, దామెర్లకుంట్ల, పెద్దచెరువు,
మఠంబావి, భీమునికొలను, కైలాసద్వారం మీదుగా క్షేత్రానికి వస్తారని, కాలిబాట మార్గములో తగిన
సదుపాయాలను కల్పించాలని సంబంధిత విభాగాలను ఆదేశించారు. అటవీశాఖ అధికారుల సమన్వయంతో
ఆయా ఏర్పాట్లన్ని పూర్తి చేయాలన్నారు.ముఖ్యంగా కాలిబాటలో భక్తులకు మంచినీటిని అందించడములో ప్రత్యేక శ్రద్ధ కనబర్బాలన్నారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఏర్పాటు చేసినట్లుగానే క్రైలాసద్వారం వద్ద అదనపు మంచినీటి
ట్యాంకులను ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా కైలాసద్వారం, భీమునికొలను మార్గములో సింటెక్సు
ట్యాంకులను నెలకొలసి మంచినీటి కుళాయిలను ఏర్పాటు చేయాలన్నారు.
భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా నీటిసరఫరాకు అవసరమైన చర్యలు
చేపట్టేందుకు ప్రత్యేకమైన కార్యచరణ ప్రణాళికను రూపొందించి ఆ క్రమంలో చర్యలు తీసుకోవాలని
ఆదేశించారు.మహాశివరాత్రిలో వేసిన మంచినీటి కుళాయిలన్నింటిని కూడా ఉగాది ఉత్సవాలలో కూడా
వినియోగించుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
ముఖ్యంగా సాక్షిగణపతి, హఠకేశ్వరం, శిఖరేశ్వరం మరియు కైలాద్వారంతో పాటు క్షేత్రంలో భక్తులు
బసచేసే పలు ప్రదేశాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇంకా దర్శనం
క్యూలైన్లలో కూడా నిరంతరం మంచినీటి సరఫరా చేయాలన్నారు.
కాలిబాట మార్గంలోని నాగలూటి, పెచ్చెర్వు, కైలాసద్వారం మొదలైన చోట్ల , శ్రీశైలక్షేత్ర
పరిధిలో పలుచోట్ల భక్తులకు అన్నదానం చేసే దాతలకు దేవస్థానం నుండి అవసరమైన పూర్తి సహాయ
సహకారాలను అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉత్సవాలలో క్షేత్రపరిధిలో కూడా
పలుచోట్ల భక్తులు అన్నదానం చేస్తుంటారని, అన్నదాన బృందాలన్నింటికి దేవస్థానం తరుపున ఆయా
ఏర్పాట్లను చేయాలని ఇంజనీరింగ్ మరియు అన్నప్రసాద వితరణ విభాగాలను ఆదేశించారు. ముఖ్యంగా
అన్నదాన ప్రాంతాలలో పైప్ పెండాల్స్, లైటింగు ఏర్పాటు, మంచినీటి సరఫరా ఏర్పాటు ఉండాలన్నారు.
క్యూలైన్లలో వేచివున్న భక్తులకు నిరంతర మంచినీరు, అల్పాహారాన్ని అందజేసే ఏర్పాట్లు చేయాలని
అన్నదాన, ఆలయ మరియు క్యూల నిర్వహణ విభాగాలను కార్యనిర్వహణాధికారి ఆదేశించారు. క్యూకాంప్లెక్సు
మరియు క్యూలైన్లలో అదనపు ఫ్యాన్లను ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైనచోట్ల కూలర్ల వర్పాటు కూడా
ఉండాలన్నారు.మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఏర్పాట్లు చేసినట్లుగానే భక్తులు సేద తీరేందుకు ఉగాది
మహోత్సవాలలో కూడా పలు చోట్ల షామియానాలు, పైప్పెండాల్స్ ( చలువ పందిర్లు) మొదలైనవి ఏర్పాటు
చేయాలని ఆదేశించారు. వీలైనన్నీ ఎక్కువ ప్రదేశాలలో ఈ ఏర్పాట్లు ఉండాలన్నారు. చలువపందిర్లు
వేసిన అన్ని ప్రదేశాలలో కూడా తగినంత విద్యుద్దీకరణ ఏర్పాట్లు ఉండాలన్నారు. అదేవిధంగా
మంచినీరు కూడా ఉండాలన్నారు.
భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీశైలమంతటా పలు ఆరుబయలు ప్రదేశాలలో లైటింగ్ ఏర్పాట్లు
చేయాలన్నారు. దేవస్థానం అతిథిగృహాల ప్రాంగణం, ఉద్యానవనాలు, తాత్కాలిక వసతిప్రదేశాలు మొదలైన
చోట్ల వీలైనంత ఎక్కువ విస్తీర్ణంలో ఈ తాత్కాలిక లైటింగ్‌ను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను
ఆదేశించారు.భక్తులకు సేవలను అందించేందుకు కర్టాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన స్వచ్చందసేవకుల
సహకారాన్ని తీసుకోవాలని ప్రజాసంబంధాల అధికారిని ఆదేశించారు.
ఆలయంలో స్వచ్చంద సేవలను అందించే సేవకులకు నిర్జీత వేళలలో షిప్టులను నిర్ణయించి వీరికి
తదనుగుణంగా తాత్కాలిక గుర్తింపు కార్డులను అందజేయాలన్నారు ఈ ఓ.లక్షలాదిసంఖ్యలో భక్తులు వస్తున్న కారణంగా దేవస్థానం వైద్యశాలలో అవసరమైన మేరకు జెషధాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
గుండెజబ్బులు మొదలైన వాటికి అవసరమైన అత్యవసరమైన మందులు, కాలినడకన వచ్చే భక్తులకు
బొబ్బల నుండి ఉపశమనం కల్పించేందుకు పూత మందులు (ఆయింట్మెంట్ మందు) మొదలైన వాటితో
పాటు అవసరమైన సూది మందులను కూడా సిద్ధంగా ఉండేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు.
ముఖ్యంగా క్షేత్రపరిధిలోనూ , కైలాసద్వారం మొదలైనచోట్ల జిల్లా వైద్యశాఖ సహకారముతో
తాత్కాలిక వైద్యశిబిరాలను ఏర్పాటు చేయాలని వైద్యవిభాగపు సహాయ కార్యనిర్వహణాధథికారిని
ఆదేశించారు.పారిశుద్ధ్య నిరర్వహణకుగాను మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల లాగానే కార్యాచరణ ప్రణాళిక
రూపొందించి ఆ దిశలో చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్య పనులకు గాను దేవస్థానం పారిశుద్ద్య
సిబ్బందితో పాటు అదనంగా సిబ్బందిని ఏర్పాటు పారిశుద్ధ్యపు విభాగపు సహాయ కార్యనిర్వహణాధికారిని
ఆదేశించారు.
ఎప్పటికప్పుడు చెత్తచెదారాలను తొలగించేందుకుగాను అవసరమైన సంఖ్యలో _ ట్రాక్టర్లను
అందుబాటులో ఉంచుకోవాలన్నారు.క్షేత్రపరిధిలో పలుచోట్ల గల శాశ్వతమరుగుదొడ్లను భక్తులు వినియోగించుకునేందుకు వీలుగా వాటిని అందుబాటులో ఉంచాలన్నారు. వీటితో పాటు పలుచోట్ల తాత్కాలిక మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా స్వచ్చ శ్రీశైలంలో భాగంగా క్షేత్రపరిధిలో బహిరంగ మలమూత్రవిసర్జనను నిషేధించిన విషయమై సూచికబోర్జుల ద్వారా భక్తులకు అవగాహన కల్పించాలన్నారు.
భక్తులకు సమాచారాన్ని తెలియజేసేందుకు అవసరమైన అన్ని చోట్ల కూడా కన్నడభాషలో విస్తతంగా
సూచికబోర్జులను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ , శ్రీశైలప్రభ విభాగాన్ని ఆదేశించారు.మహాశివరాత్రికి ఏర్పాటు చేసినట్లుగానే భక్తుల సౌకర్యార్థమై ఉచిత బస్సులను ఏర్పాటు చేయాలన్నారు.
ఉత్సవాలలో భక్తులను అలరించేందుకు కన్నడ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.
కన్నడ భక్తి సంగీతవిభావరి కార్యక్రమాలను ఏర్పాటు చేయడంతో పాటు కన్నడ ప్రవచనాలు, కన్నడ
భక్తినాటకాలు కూడా ఏర్పాటు చేయాలని ప్రజాసంబంధాల అధికారి ని ఆదేశించారు.ఉత్సవాలలో భక్తుల సౌకర్యార్థం నందిసర్మిల్, కల్యాణకట్ట, పాతాళగంగమెట్లమార్గం, సాక్షిగణపతి,
హేమారెడ్డి మల్లమ్మ మందిరం, యజ్ఞవాటిక, దేవస్థానం వైద్యశాల మొదలైన చోట్ల తాత్కాలిక సమాచార
కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమాచార కేంద్రాలలో కన్నడ ప్రాంతాల స్వచ్చందసేవకులను
ఏర్పాటు చేసుకుని వారి సహకారంతో భక్తులకు తగు సమాచారాన్ని అందజేయాలన్నారు.