×

జిల్లాలలో ఇసుక కొరత లేకుండా చర్యలు చేపట్టండి-గోపాలకృష్ణ ద్వివేది

జిల్లాలలో ఇసుక కొరత లేకుండా చర్యలు చేపట్టండి-గోపాలకృష్ణ ద్వివేది

*వీడియో కాన్ఫరెన్స్ లో జెసిలు,  మైనింగ్ శాఖ అధికారులకు ఆదేశించిన పిఆర్ అండ్ ఆర్ డి ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది :-

కర్నూలు, మే 29 :-జిల్లాలలో ప్రజల అవసరాల మేరకు ఇసుక కొరత లేకుండా నిల్వలు పెంచాలని పిఆర్ అండ్ ఆర్ డి ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది జాయింట్ కలెక్టర్లు, మైనింగ్ శాఖ అధికారులకు ఆదేశించారు.

శనివారం  అమరావతి నుంచి ఇసుక విధానం పై జెసిలు, మైనింగ్ అధికారులతో పిఆర్ అండ్ ఆర్ డి ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హల్లో జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ,  రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, మైనింగ్ డీడీ రామశివరెడ్డి, మైనింగ్ ఏడి వేణుగోపాల్, జేపీ గ్రూప్ డిస్ట్రిక్ట్ ఇంచార్జ్ హరీష్తదితరులు  పాల్గొన్నారు.

గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ జిల్లాలో ని  అన్ని రీచ్ ల్లో ఇసుక ఉత్పత్తి పెంచాలన్నారు. ఇసుక రీచ్ ల నుంచి ఇసుకను సేకరించి స్టాక్ పాయింట్ లో నిల్వ ఉంచాలన్నారు. డిపోలో ఇసుక నిల్వ చేసుకొని అవసరమైన వాళ్లకు నాణ్యమైన ఇసుక సరఫరా చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్లు రీచ్ వారీగా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని, పరిష్కారం కాని స్థితిలో  ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రభుత్వ భవన నిర్మాణ పనులు, హౌసింగ్ ప్రోగ్రామ్ కు ఇసుక కొరత రాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. రీచ్ కు రెండు వేల టన్నుల నుంచి మూడు వేల టన్నుల వరకు ఇసుక ప్రొడక్షన్ టార్గెట్ పెట్టుకొని టార్గెట్ తగ్గకుండా పెంచాలన్నారు. అందులో భాగంగా ఇసుక విధానం పై ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్ లు,  మైనింగ్ శాఖ అధికారులతో చర్చించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ,రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఇసుక సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని పిఆర్ అండ్ ఆర్ డి ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదికి వివరించారు. వర్షాకాలం వస్తుంది కనుక ఇసుక సరఫరాకు సమస్య రాకుండా ఉండేందుకు ఇసుక నిల్వలను పెంచుకునేందుకు మైనింగ్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఇసుక విధానం లో క్షేత్రస్థాయిలో వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు. డిపోల్లో కూడా ఇసుక నిల్వలు పెంచేందుకు చర్యలు చేపడుతూ మానిటరింగ్ చేస్తామన్నారు.

print

Post Comment

You May Have Missed