
శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానానికి శుక్రవారం పి.ఆర్. లక్ష్మణరావు, కాకతీయ ఎనర్జీ సిస్టమ్, ప్రైవేటు లిమిటెడ్, హైదరాబాద్ ఎలక్ట్రికల్ పరికరాలను విరాళంగా అందజేశారు.ఔట్ డోర్ లైటింగుకు ఉపయోగించే ఆటోమెటిక్ స్విచ్చులను అందించారు. ఈ సామాగ్రిని దేవస్థానం డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇంజనీరు మల్లికార్జున ప్రసాద్ కు అందించారు. వీటి విలువ రూ. 1,42,000/-ల దాకా ఉంటుందని దాత తెలిపారు. అనంతరం వారికి శ్రీ స్వామిఅమ్మవార్ల లడ్డు ప్రసాదాలను అందించారు.