EHS/JHS పథకాల మీద మంత్రి సమీక్ష
ప్రైవేట్ హాస్పిటల్స్ యజమాన్యాలతో సమావేశం
25న మరోసారి సమావేశానికి నిర్ణయం
EHS/JHS పథకాల మీద వైద్య ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ సీ లక్ష్మా రెడ్డి సమీక్షించారు. వైద్య అధికారులతో కలిసి ప్రైవేట్ హాస్పిటల్స్ యజమాన్యాలతో సమావేశం అయ్యారు. ఉద్యోగుల,జర్నలిస్టుల హెల్త్ కార్డుల మీద చర్చించారు. హెల్త్ కార్డుల చెల్లుబాటు, వైద్య పరీక్షలు, శస్త్ర చికిత్సలు, ఆయా విభాగాల వారీగా హాస్పిటల్స్ కి ఎంత మేర, ఏవిధంగా చెల్లించాలి, ప్యాకేజీ ఇవ్వడమా లేక పరీక్షల వారీగా చెల్లింపులు చేయడమా అనే అంశాలు చర్చకు వచ్చాయి. అలాగే దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఈ స్కీమ్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా పరిశీలించారు. కాగా ఆయా అంశాల మీద మరింత అధ్యయనం అవరమని భావించారు. ఈ నెల 25న మరోసారి భేటీ కావడానికి నిర్ణయించారు. ఈ సమావేశంలో వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కే మనోహర్, ehs/jhs సీఈఓ డాక్టర్ కే. పద్మ, ఆయా ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాల ప్రతినిధులు పాల్గొన్నారు.