ఎటువంటి అపోహలకు లోనుకావద్దు-ఈ ఓ

 శ్రీశైల దేవస్థానం: శ్రీలలితాంబికా షాపింగ్ కాంప్లెక్స్ లో  దుకాణముల కేటాయింపు   ఉన్నత న్యాయస్థానముల తీర్పు అనుసరించి చేస్తామని  శ్రీశైల దేవస్థానం ఈ ఓ అధికార ప్రకటన చేసారు.ఈ విషయమై ఎవరు కూడా అనవసరమైన వ్యాఖ్యలు చేయకూడదని వినతి చేసారు. కోర్టు పరిధిలో ఉన్న విషయం పై వ్యాఖ్యలు చేయడం సముచితం కాదని కూడా పేర్కొన్నారు. ఉన్నత న్యాయస్థానం  తీర్పు అనుసరించి దేవస్థానం తదుపరి చర్యలు తీసుకోవలసివుందని వివరించారు.ఈ విషయమై అందరు  వాస్తవాలను గ్రహించవలసినదిగా కోరారు.  ఎవరు  ఎటువంటి అపోహాలకు లోనుకావద్దని కూడా పేర్కొన్నారు. ఈ దుకాణాల కేటాయింపు డిప్ గురించి కొందరు సామాజిక మాధ్యమాలలో దుష్ప్రచారం చేస్తున్నట్లుగా దేవస్థానం దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఈ ప్రకటన చేస్తున్నట్లు పేర్కొన్నారు.

     లలితాంబికా షాపింగ్ కాంప్లెక్స్లో  షాపుల కేటాయింపునకుగాను 24.12.2021న చంద్రవతి కల్యాణ మండపం లో  డిప్ నిర్వహించినట్లు ఈ ఓ  గుర్తు చేసారు.ఆంధ్రప్రదేశ్  ఉన్నత న్యాయస్థానం, ఆంధ్రప్రదేశ్ తేది : 21.10.2021 రోజున తీర్పును మరియు భారత  సర్వోన్నత న్యాయస్థానము తేది : 17.12.2021 తీర్పును అనుసరించి ఈ డిప్ నిర్వహించినట్లు పేర్కొన్నారు.కార్యనిర్వహణాధికారి  ఆధ్వర్యములో జరిగిన ఈ డిప్లో  స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ, సహాయ కమి షనర్ (ఇంచార్జి) మరియు సహాయ కార్యనిర్వహణాధికారి పి. నటరాజరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు నరసింహారెడ్డి, శ్రీశైలప్రభ సంపాదకుడు డా.సి.అనిల్ కుమార్, పర్యవేక్షకులు డి.రాధకృష్ణ, బి. మల్లికార్జునరెడ్డి, ఎన్. శ్రీహరి, కె.శివప్రసాద్,బి. శ్రీనివాసులు పలు విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

 

print

Post Comment

You May Have Missed