శ్రీశైల దేవస్థానం:మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న శ్రీస్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ ఓ దంపతులు వ్యక్తిగతంగా ఈ పట్టువస్త్రాలను సమర్పించారు.
సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు, ఫలపుష్పాదులు శ్రీస్వామి అమ్మవార్లకు సమర్పించారు.
కార్యక్రమములో స్వామివారి ఉపప్రధానార్చకులు వీరయ్యస్వామి, అమ్మవారి ప్రధానార్చకులు మార్కండేయశాస్త్రి, ఆలయ సహాయ కార్యదర్శి ఎం. హరిదాసు, స్వామివార్ల పర్యవేక్షకులు అయ్యన్న, తదితరులు పాల్గొన్నారు.