
శ్రీశైలదేవస్థానం:అక్టోబరు 26 నుంచి నవంబరు 23 వరకు కార్తీక మాసోత్సవాలు జరుగనున్న సందర్భంగా
కార్తీక మాసంలో తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా పలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రాన్ని దర్శించే అవకాశం ఉంది.భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ మాసోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇందులో భాగంగా మంగళవారం కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న కల్యాణకట్ట, నందీశ్వర
డార్మెటరీ, గంగా భవాని స్నాన ఘట్టాలను పరిశీలించారు. కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ కల్యాణ కట్టలో క్షురకులు భక్తల నుంచి ఎలాంటి మొత్తాన్ని స్వీకరించకూడదన్నారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. భక్తులు కేవలం కేశ ఖండన టికెట్టును మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు.ఈ విషయం లో ఖచ్చితంగా వ్యవహరించాలని సిబ్బందిని ఆదేశించారు. భక్తులతో మర్యాదగా మెలగాలని అక్కడి సిబ్బందికి, క్షురకులకు సూచించారు. కల్యాణ కట్టను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.
అనంతరం నందీశ్వర డార్మెటరీని పరిశీలించారు. డార్మిటరీలో విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు సజావుగా పనిచేసేవిధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటుండాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఈ ఓ ఆదేశించారు. డార్మిటరీ ముందువైపు ఉన్న ఫ్లోరింగ్ పనులు నాణ్యతతో ఉండాలన్నారు. ఆ తరువాత కార్యనిర్వహణాధికారి గంగాభవాని స్నానఘట్టాలను పరిశీలించారు.
కార్తీక మాసములో అధికసంఖ్యలో భక్తులు క్షేత్రాన్ని సందర్శిస్తుంటారని, పలువురు భక్తులు గంగా భవాన్ని స్నానఘట్టాలలో కూడా స్నానాలకు వస్తారని అందుకే స్నాన ఘట్టాల వద్ద భక్తులకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించాలన్నారు. స్నానఘట్టాల వద్ద ఉన్న కుళాయిలకు మరమ్మతులు చేసి, అన్ని కుళాయిల ద్వారా కూడా నీరు వచ్చే ఏర్పాటు చేయాలన్నారు.స్నాన ఘట్టాలలో మహిళలు స్నానం చేసే గది, దుస్తులు మార్చుకునే గదికి వెంటనే మరమ్మతులు చేయాలన్నారు. స్నాన ఘట్టాల వద్ద తగినంత విద్యుద్దీపాలను ఏర్పాటు చేయాలన్నారు.
ప్రత్యేకంగా పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు స్నానఘట్టాలను, పరిసరాలను శుభ్రపరుస్తుండాలని శానిటేషన్ విభాగాన్ని ఆదేశించారు.స్నానఘట్టాలలో అవసరమైన పెయింటింగ్ పనులను కూడా చేపట్టాలన్నారు.
స్నానఘట్టాల ఎగువభాగంలో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడే విధంగా తగు చర్యలు చేపట్టాలన్నారు.
అక్కడి గోడలపై శివలీలా విశేషాలకు సంబంధించిన చిత్రాలను చిత్రీకరింపజేయాలన్నారు.
ముఖ్యంగా స్నానఘట్టాల పరిసరాలలో గన్నేరు మొక్కలను, పలు రకాల పూల మొక్కలను నాటాలని ఉద్యానవన విభాగాధికారిని ఆదేశించారు.దీని వలన స్నానఘట్టాల పరిసరాలు ఆహ్లాదకరంగా వుంటాయన్నారు.