×

శిథిలాల ఎత్తివేత పనులను త్వరితగతిన పూర్తి చేయాలి-ఈ ఓ

శిథిలాల ఎత్తివేత పనులను త్వరితగతిన పూర్తి చేయాలి-ఈ ఓ

 శ్రీశైల దేవస్థానం:రథశాల – పోస్టాఫీస్, రథశాల – పాతాళగంగ మార్గంలో  లో తొలగించిన  దుకాణాల శిథిలాల ఎత్తివేత పనులను శుక్రవారం  కార్యనిర్వహణాధికారి  లవన్న  ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఈ ఓ  మాట్లాడుతూ శిథిలాల ఎత్తివేత పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఫిబ్రవరి 11 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయని, ఆలోగా రహదారి ( సి.సిరోడ్డు నిర్మాణాన్ని ) నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. దుకాణాల తొలగింపు వలన లభించిన రాళ్ళు రప్పలు మొదలైనవాటిని వృథా చేయకుండా దేవస్థానం అవసరాలకు వినియోగించాలన్నారు.తరువాత శ్రీలలితాంబికా దుకాణాల సముదాయాన్ని పరిశీలించారు. అక్కడ వ్యాపారాలను నిర్వహించుకుంటున్న పలువురితో సంభాషించారు.ముఖ్యంగా అక్కడ దుకాణాలను నిర్వహించుకుంటున్న పలువురు చెంచు  గిరిజనులతో మాట్లాడుతూ ప్రణాళికబద్ధంగా వ్యాపారాలను నిర్వహించుకోవాలన్నారు.

ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు వి. రామకృష్ణ, ప్రజాసబంధాల అధికారి టి. శ్రీనివాసరావు, రెవెన్యూ విభాగపు పర్యవేక్షకులు అయ్యన్న, రెవెన్యూ విభాగం గుమాస్తా ఇ. మల్లిక్ రాజా, అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు భవన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed