
శ్రీశైల దేవస్థానం:భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో స్వామివారి యాగశాల ఉత్తర భాగం,
నాగులకట్ట ప్రాంతం మొదలైన చోట్ల బండ పరుపు ఏర్పాటు చేసారు.శనివారం ఈ ఓ ఎస్.లవన్న ఈ పనులును పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బండ పరుపు పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
త్వరలో ప్రారంభించుచున్న సర్పదోష నివారణ పూజలు నిర్వహించటానికి నాగులకట్ట వద్ద
షెడ్డు ఏర్పాటు పనులు ప్రారంభించారు. ఈ పనులను కూడా ఈ ఓ
పరిశీలించారు. ఈ షెడ్డు పనులు నిర్మాణాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఈ ఓ
సంబంధిత అధికారులను ఆదేశించారు. తర్వాత నాగులకట్ట ప్రదేశం కుడి భాగంలో వుండే సాలు మండపమునకు సాలహారం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఈ పరిశీలనలో ఉప కార్యనిర్వహణ ఇంజనీరింగ్ అధికారి ఎం.నరసింహరెడ్డి, సహాయక స్థపతి ఐ.యు.వి.జవహార్ తదితరులు పాల్గొన్నారు.