
మచిలీపట్నం : బచ్చుపేట శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఆలయంలో జరుగుతున్న స్వామి వారి కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ధ్వజావరోహణ కార్యక్రమం సంప్రదాయరీతిన జరిగింది.ద్వాదశి ప్రదక్షిణలు జరిగాయి. ఉదయం, సాయంత్రం వివిధ పూజా కార్యక్రమాలను అర్చక స్వాములు నిర్వహించారు.