ప్రతి ఉద్యోగి జవాబుదారితనం తో విధులు నిర్వర్తించాలి-ఈ ఓ లవన్న

 శ్రీశైల దేవస్థానం:ఈ రోజు (30.09.2021)న  కార్యనిర్వహణాధికారి  ఎస్.లవన్న  దేవస్థాన పరిపాలనా సంబంధి అంశాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

పరిపాలనా భవనం లోని సమావేశ మందిరం లో జరిగిన ఈ సమీక్షా సమావేశం లో అన్ని విభాగాల అధిపతులు, పర్యవేక్షకులతో పాటు వివిధ విభాగాలలో విధులు నిర్వహిస్తున్న గుమాస్తా స్థాయి సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఈ సమీక్షలో కార్యనిర్వహణాధికారి  పలు సంబంధి అంశాలను ఆయా విభాగాల వారిగా సమీక్షించారు.

ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి  మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి కూడా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా, జవాబుదారితనం తో తమ విధులు నిర్వర్తించాలన్నారు.

అదేవిధంగా శాఖాధికారులు (యూనిట్ అధికారులు), పర్యవేక్షకులు వారి వారి విభాగాలను నిరంతరం పర్యవేక్షిస్తుండాలన్నారు. నిరంతరం పర్యవేక్షణ వల్ల శాఖల పనితీరు సమర్థవంతంగా వుంటుందన్నారు.

ముఖ్యంగా వివిధ విభాగాలకు సంబంధించిన ఆడిట్ అభ్యంతరాల గురించి సమావేశములో సుదీర్ఘంగా చర్చించారు. అన్ని విభాగాల వారు ఆయా ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఆడిట్ అభ్యంతరాలకు సమాధానాలను రూపొందించి, ఆయా అభ్యంతరాలను తొలగింపజేసేందుకు అన్ని విభాగాల అధికారులు ప్రత్యేకశ్రద్ధ కనబర్చాలన్నారు. ఆడిట్ అభ్యంతరాల సమాధానాలను రూపొందించేందుకు పాతరికార్డులను పరిశీలించాల్సిన అవసరం ఉంటుందని, అందుకే రికార్డు రూమును ఎప్పటికప్పుడు క్రమపద్ధతిలో నిర్వహించాలన్నారు. అన్ని విభాగాల పాతరికార్డులన్ని సంవత్సరాలవారిగా వెంటనే అందుబాటులో ఉంచాలని రికార్డు విభాగాన్ని ఆదేశించారు.

పరోక్షసేవల నిర్వహణపై సమీక్ష:

ఈ సమావేశం లో దేవస్థానం నిర్వహిస్తున్న పరోక్షసేవల గురించి కూడా కార్యనిర్వహణాధికారి సమీక్షించారు.

పరోక్షసేవల నిర్వహణను పై కార్యనిర్వహణాధికారి  మాట్లాడుతూ పరోక్షసేవల నిర్వహణ గురించి సామాజిక మాధ్యమాల ద్వారా మరింత ప్రచారాన్ని కల్పించాలన్నారు.

అదేవిధంగా సంక్షిప్త సమాచారాన్ని ( బల్క్ ఎస్.ఎం.ఎస్) విధానాన్ని కూడా సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు.

పరోక్షసేవకర్తలకు ఎటువంటి ఆలశ్యం లేకుండా ఏరోజుకారోజు ప్రసాదాలను పంపిస్తుండాలని ఆదేశించారు. –

పరోక్షసేవల నిర్వహణలో తరుచుగా సమీక్ష సమావేశాలు  ఏర్పాటు చేస్తుండాలని ఆలయ విభాగాన్ని ఆదేశించారు.

print

Post Comment

You May Have Missed