
శ్రీశైలదేవస్థానం: ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు శ్రీశైలం శాఖ వారు శుక్రవారం శ్రీశైల దేవస్థానానికి ట్రాక్టరును సమర్పించారు. ఈ మేరకు బ్యాంకు చైర్మెన్ ఎస్. సత్యప్రకాశ్ సింగ్, కడప సదరు ట్రాక్టరును కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు కు అందించారు.ఈ ట్రాక్టరు విలువ రూ. 12 లక్షల దాకా ఉంటుందని బ్యాంకు అధికారులు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి ముందుగా గంగాధర మండపము వద్ద ట్రాక్టరుకు వాహన పూజలను జరిపించారు. కార్యక్రమానంతరం బ్యాంకు అధికారులకు స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, లడ్డూప్రసాదాలు, స్వామిఅమ్మవార్ల చిత్రపటాన్ని అందించారు.
ఈ కార్యక్రమం లో దేవస్థానం ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు వి. రామకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు ( ఐ/సి) చంద్రశేఖరశర్మ, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు, నంద్యాల రీజినల్ మేనేజర్ పి.వి. రమణ, శ్రీశైలం శాఖ మేనేజరు కె.సుబ్రహ్మణ్యం, స్థానిక ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు శాఖ పూర్వపు మేనేజర్ కె. రామచంద్రశర్మ, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.