శ్రీశైల దేవస్థానం:భక్తుల వసతి సౌకర్యార్థం కుటీర నిర్మాణం పథకం కింద దేవస్థానం నిర్మిస్తున్న గణేశసదనములోని ఒక గది నిర్మాణానికి సోమవారం విరాళం అందింది.హైదరాబాదు చెందిన కొండా విజయ్ కుమార్ ఇందుకు సంబంధించిన విరాళ మొత్తం రూ. 5 లక్షల చెక్కును సహాయ కమిషనర్ కు అందజేశారు.గతం లో ఈ గది నిర్మాణానికి రూ. 5లక్షలను చెల్లించగా, ప్రస్తుతము మరో రూ. 5 లక్షలను విరాళంగా చెల్లింపు చేసారు. ఈ సందర్భంగా దాతకు స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు అందించారు.
*వెండి రథోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఘనంగా జరిగాయి.
*Donation of Rs. 1,00,008 for Annadanam scheme By Gangasani Venu Gopal Reddy, Kadapa.