
శ్రీశైల దేవస్థానం:భక్తుల వసతి సౌకర్యార్థం కుటీర నిర్మాణం పథకం కింద దేవస్థానం నిర్మిస్తున్న ఎ గ్రేడ్ కాటేజీ నిర్మాణానికి సంబంధించి శనివారం విరాళం అందింది.
తెలంగాణా రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లికి చెందిన గళ్ళ హర్షవర్ధన్, శ్రీమతి గళ్ళ శ్రీజ దంపతులు రూ. 10 లక్షలను చెక్కు రూపం లో దేవస్థాన కార్యాలయం లో కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్నకు అందజేశారు.
ఈ సందర్భంగా వారికి స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు అందించారు.