
శ్రీశైల దేవస్థానం:దేవస్థానం నిర్వహిస్తున్న ఆగమ పాఠశాలకు గురువారం శ్రీశైల మల్లికార్జున భజన సంఘ్, యర్రంగలిగి, బళ్ళారి వారు వంట పాత్రలను విరాళంగా అందజేశారు.దాతలు ఈ పాత్రలను దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు సమక్షములో ఆగమ పాఠశాల అధికారులకు అందజేశారు. దాతలు మాట్లాడుతూ ఈ వంట పాత్రల విలువ మొత్తం రూ. లక్ష దాకా ఉంటుందని తెలిపారు. అసిస్టెంట్ కమిషనర్ హెచ్.జి. వెంకటేశ్, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఐ.ఎన్.వి. మోహన్, పర్యవేక్షకులు పి. దేవిక తదితర సిబ్బంది పాల్గొన్నారు.