
శ్రీశైల దేవస్థానం:బి. సునీల్ భార్గవ్, బ్రాడీపేట, గుంటూరు శుక్రవారం రాత్రి ఐదు వెండి కిరీటాలను సమర్పించారు.
వీటిలో 2 కిరీటాలు బరువు 740 గ్రాములు కాగా తక్కిన 3 కిరీటాల బరువు 420 గ్రాములు.
అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో దాతలు ఈ వెండి కిరీటాలను ఈ ఓ కు అందజేశారు.అనంతరం దాతలకు వేదాశీర్వచనం చేసి శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలను అందించారు.