
శ్రీశైల దేవస్థానం; సాగర్సాఫ్ట్ (ఇండియా) లిమిటెడ్, హైదరాబాద్ వారు బుధవారం దేవస్థానం వైద్యశాలకు వివిధ రకాలైన మందులను విరాళంగా అందజేశారు.ఈ మేరకు సహాయ కార్యనిర్వహణాధికారి ఫణిధర ప్రసాద్ కు ఈ మందులు అందించారు. జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పి, ఊపిరితిత్తుల వ్యాధులు, గ్యాస్ట్రబుల్, ఇన్ఫెక్షన్లు మొదలైన వ్యాధులకు సంబంధించిన మందులను అందించారు.వీటి విలువ సుమారు రూ. 4 లక్షల వరకు ఉంటుందని దాతలు తెలిపారు.
కార్యక్రమంలో దేవస్థాన వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న అపోలో డాక్టర్లు డా. గణేష్, ప్రవీణ్ కుమార్ రెడ్డి విశ్రాంత ల్యాబెక్నిషియన్ రాఘవేంద్రుడు, సంబంధిత గుమాస్తా కె. శ్రీనివాసులు, దేవస్థానం వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.